K.Viswanath: కే విశ్వనాథ్ సినీ కెరియర్ లో చరిత్ర సృష్టించిన సినిమాలు ఇవే..!

స్వర్గీయ దిగ్గజ దర్శకుడు కే.విశ్వనాథ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తాను చేసిన సినిమాల ద్వారా ఎప్పుడు సజీవంగానే ఉంటారు. ఈరోజు ఆయన వర్ధంతి కావడంతో ఆయనకు సంబంధించిన అలాగే ఆయన తెరకెక్కించిన చిత్రాల గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఎన్నో అపురూప చిత్రాలు ప్రేక్షకుల మధి లో శాశ్వతంగా నిలిచిపోవడమే కాదు జాతీయ అవార్డులను కూడా తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఈయన తీసిన ప్రతి చిత్రము ఒక ఆణిముత్యం అని చెప్పవచ్చు. వినసొంపైన సంగీతం.. అర్థవంతమైన మాటలతో.. ఎప్పటికీ నిలిచిపోయే పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలలో మీకు ఇష్టమైన అంశం ఏంటి అంటే వెంటనే చెప్పడం చాలా కష్టం.. అంతలా తన ప్రతి చిత్రము ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

60 సినిమాలకు దర్శకత్వం వహించిన కే విశ్వనాథ్ తాను రచించి తెరకెక్కించిన ఒక ఐదు సినిమాలు మాత్రం ఎప్పటికీ అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా ఈయన పనితనాన్ని గుర్తించి..ఆ 5 చిత్రాలకు భారత ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించింది.అంతేకాదు ఈ ఐదు చిత్రాలు ఆయన సినీ కెరియర్ లోనే చరిత్ర సృష్టించిన సినిమాలుగా నిలిచిపోయాయి..

- Advertisement -

శంకరాభరణం:

శంకరాభరణం
ఈ సినిమా గురించి ప్రస్తావించకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడలేమని చాలామంది చెబుతారు. ఎందుకంటే ఎటువంటి కమర్షియల్ టచ్ లేకుండా కేవలం సంగీతమే ప్రధానంగా తెరకెక్కి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. జేవీ.సోమయాజులు లీడింగ్ రోల్ పోషిస్తూ.. 1980లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచి.. ఏకంగా నాలుగు జాతీయ అవార్డులను అందించింది.

సప్తపది:

సప్తపది
ఇందులో కూడా జేవీ సోమయాజులు ప్రధాన పాత్ర పోషించగా.. సబితా భమిడిపాటి, రవిశంకర్, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రలో 1981లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే.. నర్గీస్ దత్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు లభించింది.

స్వాతిముత్యం:

స్వాతిముత్యం
అప్పట్లో వితంతు వివాహాలు నేరంగా భావించే వాళ్ళు.. అలాంటి సమయంలో చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీ మళ్లీ వివాహం చేసుకోవచ్చనే ఆలోచనను రేకెత్తించింది ఈ సినిమా.. ఈ సినిమాలో కమలహాసన్ యాక్టింగ్ వేరే లెవెల్ .. అమాయకుడిగా ఆయన హావభావాలు.. భర్తను కోల్పోయిన వితంతువుగా రాధిక నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రానికి ఉత్తమ ఫీచర్ ఫిలిం గా జాతీయ అవార్డు లభించింది.

సూత్రధారులు:

సూత్రధారులు

సమాజంలో మార్పు రావాలంటే హింస మాత్రమే మార్గం కాదని.. శాంతి మాత్రమే సరైన దారి అని చాటిచెప్పిన చిత్రం ఇది. ఇందులో భానుచందర్ , రమ్యకృష్ణ, సత్యనారాయణ, అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్ కీలక పాత్రలు పోషించారు. 1989లో విడుదలైన ఈ చిత్రానికి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు లభించింది.

స్వరాభిషేకం:

స్వరాభిషేకం
2004లో విడుదలైన ఈ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిలిం కేటగిరీలో జాతీయ అవార్డును అందుకోగా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ కు జాతీయ అవార్డు లభించింది. కమర్షియల్ చిత్రాల హవా నడుస్తున్న సమయంలో సంగీత ప్రధాన చిత్రంగా విడుదలై రికార్డు సృష్టించింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు