Vineeth: హీరో వినీత్ గుర్తున్నాడా.. ఫ్యామిలీని చూసారా..?

Hero Vineeth

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరో ఫ్రెండ్ గా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించారు వినీత్. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో కూడా నటించారు. ముఖ్యంగా ప్రేమ దేశం సినిమాతో భారీ క్రేజ్ ని సంపాదించుకున్నారు. 1996లో ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో అబ్బాస్, వినీత్, టబు ప్రధానపాత్రలో నటించారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. వినీత్ ఈ సినిమా తర్వాత సరిగమలు, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర సినిమాలలో కూడా నటించారు.

చాలామందికి నటుడు గా మాత్రమే వినీత్ తెలుసు.. కానీ అతనిలో కూడా ఒక మంచి డాన్సర్ ఉన్నారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వినీత్ భరతనాట్య కచేరీలలో తన ప్రతిభను ఎన్నోసార్లు ప్రదర్శించారు. విదేశాలలో కూడా భరతనాట్య కార్యక్రమాలను పాల్గొంటూ అందరినీ అబ్బుర పరిచారు. స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో ఇచ్చే సమయంలో.. పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకున్నారట. అయితే ఆ తర్వాత కాలంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, కొరియోగ్రాఫర్ గా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు.

కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న వినీత్.. రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో కూడా కనిపించారు.. వినీత్ కుటుంబ విషయానికి వస్తే.. 2004లో ప్రిసిల్లా మీనన్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నది. వీరికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వినీత్ కుమార్తె ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

hero vineeth family photos are going viral

ఏంటీ వినీత్ కు ఇంత పెద్ద కుమార్తె ఉందా? అంటూ ఈ ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్ శోభనతో కలసి వినీత్ భరతనాట్య కచేరీలలో కూడా ఎక్కువగా పాల్గొనేవారు. ప్రస్తుతం వినీత్ ఎక్కువగా నాట్య ప్రదర్శనలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వీరి కుటుంబానికి సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసినప్పటి నుంచి అభిమానులు సైతం తెలుగు సినిమాలలో విలన్ గా అయినా.. లేకపోతే ఏదైనా మంచి పాత్రలో నటించి మళ్ళీ రీయంట్రి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మొత్తానికైతే వినీత్ ఫ్యామిలీ చూడచక్కగా ఉందని చెప్పవచ్చు.

hero vineeth family photos are going viral

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు