Tollywood Drugs Case: డ్రగ్ కేస్ లో కీలక మలుపు.. వారు సేఫ్..!

Tollywood Drugs Case

2018 వ సంవత్సరంలో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా డ్రగ్స్ కేస్ పెను సంచలనం సృష్టించింది. చాలామంది సెలబ్రిటీల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో వినిపించాయి. ఇందులో సినీ తారల పైన నమోదైన ఆరు కేసులను తాజాగా న్యాయస్థానం కొట్టేసింది కానీ ఎక్సైజ్ శాఖ మాత్రం సరైన ప్రొసీజర్ పాటించలేదంటూ తమ అభిప్రాయాలను వెల్లడించింది.. FNL నివేదిక ఆధారంగానే సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేస్ కొట్టివేసినట్లుగా పలు నివేదికలు వెల్లడించాయి . సెలబ్రిటీలు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా కేస్ ఫైల్ అయినా.. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసుని నాంపల్లి కోర్టు కొట్టి వేసినట్లుగా ప్రకటించింది.

2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్ గా ఎక్స్చేంజ్ శాఖ తమ దూకుడుని ప్రదర్శించింది. ఇందులో ముఖ్యంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ, నవదీప్, రవితేజ, ముమైత్ ఖాన్, తనీష్, శ్యామ్ కే నాయుడు తో పాటూ పలువురు సెలబ్రిటీలపై డ్రగ్స్ కేస్ నమోదు అయ్యింది. వీరి పైన ప్రత్యేక దృష్టి సాధించిన ప్రభుత్వం ప్రత్యేక సిట్టింగ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వారిని నెలల తరబడి విచారించినప్పటికీ ఎలాంటి ఫలితాలు కూడా లేకపోయాయి.

ముఖ్యంగా సెలబ్రిటీల నుంచి వెంట్రుకలు మరియు గోళ్లను కూడా శాంపిల్స్ తీసుకున్నారు.. అయితే ఇందులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ వంటి వారివి మాత్రమే శాంపిల్స్ ను ఫారెన్సీ క్లబ్ కు పంపించారు.. అయితే ఇందులో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు కూడా కనిపించలేదని తేలిపోయింది. పైగా డ్రగ్స్ కేసులో పాటించాల్సిన విధివిధానాలను కూడా అధికారులు సరిగ్గా ఫాలో అవ్వకపోవడంతో ఎక్సైజ్ శాఖకు కోర్టులో ఇబ్బందులు ఎదురయ్యాయి.

- Advertisement -

ఈ ఆర్ కేసుల్లో ఎటువంటి సాక్షాదారాలు లేకపోవడంతో న్యాయస్థానం వీటి గురించి వివరించమని తెలిపింది. పూరి జగన్నాథ్ తరుణ్ శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు కూడా లభ్యం కాలేదంటూ ఫారెన్సీ క్లబ్ కూడా ధ్రువీకరించడంతో.. ఈ రిపోర్టులు పరిశీలించిన అనంతరం వీరి మీద కేసులు కొట్టివేశారు. దీంతో అటు డైరెక్టర్ పూరీ, తరుణ్ ఇద్దరూ కూడా సేఫ్ అన్నట్లుగా తెలుస్తోంది. మరి మిగతా సెలబ్రిటీలను కూడా ఇదే తరహాలో విచారించిన తర్వాత ఈ కేసు మూసి వేస్తారేమో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు