RajKiran: చిరు డాటర్ బాటలో మరో నటుడి కూతురు.. కట్ చేస్తే..!

RajKiran

మెగాస్టార్ చిరంజీవి శ్రీజ మొదట తాను ప్రేమించిన అబ్బాయి కోసం కుటుంబ సభ్యులను కూడా ఎదిరించి వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. అతడి అఘాయిత్యాలను తట్టుకోలేక.. విడాకులు ఇచ్చి మళ్ళీ తండ్రి వద్దకు చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో ప్రముఖ తమిళ్ నటుడు రాజ్ కిరణ్ కుమార్తె కూడా నడిచింది.

అసలు విషయంలోకి వెళ్తే కోలీవుడ్లో ప్రముఖ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ కిరణ్.. ఇక ఈయన కుమార్తె జీనత్ ప్రియ తాజాగా ఇంటికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. 2022లో మునీష్ రాజా అనే తమిళ్ సీరియల్ నటుడిని జీనత్ ప్రియ ప్రేమించి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరీ వివాహం చేసుకుంది. అయితే జీనత్ ప్రియ.. మునీష్ వల్ల కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అతను కొడుతున్నాడని, చిత్రహింసలు పెడుతున్నాడు అంటూ వీడియో కూడా రిలీజ్ చేసింది.. ” నాన్న.. నన్ను క్షమించు.. నీ మాట కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయా… నీతోనే ఇకపై నా జీవితాన్ని గడుపుతాను నాన్న..” అంటూ వీడియోలో కన్నీరు మున్నిరయింది జీనత్ ప్రియ..

జీనత్ ప్రియను రాజ్ కిరణ్ దత్తత తీసుకున్నారు. జీనత్ ప్రియ తిరిగి ఇంటికి వచ్చేయడంతో ఆమెను రాజ్ కిరణ్ సంతోషంగా స్వాగతించినట్లు తెలుస్తోంది. ఇకపోతే జీనత్ ప్రియ పెద్దలను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాజ్ కిరణ్ కి ఎన్నో అవమానాలను మిగిల్చినప్పటికీ కూడా రాజ్ కిరణ్… చిరంజీవిలాగే తన కూతుర్ని ఇంట్లోకి స్వాగతించినందుకు నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇకపోతే మరొకవైపు చిరంజీవి తన కూతుర్ని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. మరి ఈయన కూడా ఒక మంచి అబ్బాయిని చూసి తన కూతురికి వివాహం చేస్తారేమో చూడాలి..

- Advertisement -

మునీష్ రాజా తో జీనత్ ప్రియ వివాహం విషయానికి వస్తే.. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరూ.. మొదట స్నేహితులుగా ఉన్నారు.. ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది.. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నారు.. ఇక వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంబం ఓకే చెప్పింది కానీ రాజ్ కిరణ్ కుటుంబం మాత్రం పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు.. మనీష్ రాజాకు తన కూతురిని వివాహం చేసుకొనే అర్హత లేదని కూడా రాజ్ కిరణ్ తెలిపారు. దీంతో రాజ్ కిరణ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీనత్.. రాజ్ కిరణ్ పై పలు ఆరోపణలు కూడా చేసింది. కానీ జీనత్ తన తండ్రి విలువను తెలుసుకుని.. భర్త చేస్తున్న అఘాయిత్యాలను తట్టుకోలేక అతడితో విడాకులు తీసుకున్నట్లు వీడియో రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు