Mrunal Thakur: ఆ కోరిక తీర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్ ?

Mrunal Thakur

బాలీవుడ్ అందాల తార మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో కంటే మన తెలుగులోనే ఎక్కువగా రాణిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే టాప్ హీరోలతో సినిమా చేసిన మృనాల్ ఠాకూర్ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే…. మృణాల్ ఠాకూర్, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా విజయం తర్వాత ఈ భామకు వరుసగా తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో ఓ మాత్రం ఎక్స్పోజింగ్ కి అవకాశం లేకుండా చాలా హుందాగా, అందంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మృణాలు ఇప్పటికే నానితో 30 హాయ్ నాన్న సినిమా చేసింది. అలాగే విజయ్ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన కెరీర్ గురించి ఇటీవల ఆసక్తికర విషయాలు పంచుకుంది.

“నేను హృతిక్ రోషన్ కి బిగ్ ఫ్యాన్. ఆయన మూవీలో నటించినా, కానీ ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. ఆ కోరిక తీరనందుకు బాధపడుతున్న. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో పెద్దగా డాన్స్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఈ లోటును విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ తీరుస్తుంది’ అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. కాగా అటు మృణాల్ ఠాకూర్ కావాల్సినంత అందాలని ఆరబోస్తూ కిర్రాకు పుట్టిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు