Family Star : ఫ్యామిలీ స్టార్ రిజల్ట్… అల్లు అరవింద్, నాగ చైతన్య హ్యాపీ

Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ ఫామిలీ ఎంటర్టైనర్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశారు చిత్రబృందం. కానీ ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ కు నెగెటివ్ టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తో ప్రస్తుతం ఇండస్ట్రీలోని ప్రముఖులు ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హీరో అక్కినేని నాగ చైతన్య హ్యాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఫ్యామిలీ స్టార్ కి నెగెటివ్ టాక్ వస్తే వీళ్లేందుకు సంతోషంగా ఉన్నారు ? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

అల్లు అరవింద్, నాగ చైతన్యతో డైరెక్టర్ విభేదాలు

“గీత గోవిందం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ పరశురాం – విజయ్ దేవరకొండ కాంబినేషన్ “ఫ్యామిలీ స్టార్” అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలోనే పరశురామ్ కి, గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ కి మధ్య గొడవ జరిగిందంటూ రూమర్స్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. గతంలో “గీత గోవిందం” మూవీ హిట్ అవ్వడంతో డైరెక్టర్ పరుశురాం చాలా సినిమాలకు ఒకేసారి కమిట్మెంట్ ఇచ్చాడట. అందులో భాగంగానే కొంత మేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని టాక్ నడిచింది. ఇక ముందుగా అనుకున్నట్టుగా “గీత గోవిందం” తర్వాత పరుశురాం తన నెక్స్ట్ మూవీ అల్లు అరవింద్ తో చేయాల్సి ఉంది. కానీ నాగ చైతన్యతో మూవీ తీసే అవకాశం రావడంతో 14 రీల్స్ బ్యానర్ లో ఆ మూవీని తీసి, తిరిగి వస్తానని పరుశురాం అల్లు కాంపౌండ్ నుంచి బయటకు అడుగు పెట్టాడు. కానీ అదే టైంలో మహేష్ బాబుకు సర్కారు వారి పాట స్టోరీ చెప్పడంతో అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నాగ చైతన్యను ఎలాంటి రీజన్స్ చెప్పకుండా, పక్కన పెట్టేసి, మహేష్‌తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.

మహేష్ బాబుతో “సర్కారి వారి పాట” మూవీ ఛాన్స్ రావడంతో నాగ చైతన్యను పక్కన పెట్టి మైత్రి మూవీ మేకర్స్ తో మహేష్ మూవీ చేశాడు. దీంతో 14 రీల్స్ తో పరుశురాంకు ఇబ్బందులు రావడంతో “సర్కారు వారి పాట”లో ఆ ప్రొడక్షన్ హౌజ్ ను కూడా ఒక భాగం చేశారు. సర్కారు వారి పాట తర్వాత మళ్లీ నాగ చైతన్యతో మూవీ చేయడానికి వచ్చాడు. కానీ, అప్పుడు నాగ చైతన్య స్టోరీలో మార్పులు కోరాడు. దానికి కూడా పరుశురామ్ టైం తీసుకున్నాడట. దీంతో నాగ చైతన్య ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే కొంతకాలం పరశురామ్ కోసం వెయిట్ చేసిన నాగ చైతన్యకు ఆయన తీరుతో కోపం వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని నాగ చైతన్య ముందు ప్రస్తావించగా దర్శకుడు పరశురామ్ గురించి మాట్లాడటం వేస్ట్ ఆఫ్ టైమ్, అతను నా సమయాన్ని వృధా చేసాడు, ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడను అని ముఖం మీదే కుండబద్దలు కొట్టాడు నాగ చైతన్య. వీరిద్దరి కాంబోలో రావలసిన మూవీకి అప్పటికే “నాగేశ్వర రావు” అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారు. కానీ ఆ తరువాత పరశురామ్ మిస్టేక్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. పోనీ ఆ తర్వాత అయినా అల్లు అరవింద్ తో సినిమా చేస్తాడేమో అనుకుంటే దిల్ రాజు – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో “ఫ్యామిలీ స్టార్” చిత్రాన్ని ప్రకటించాడు.

- Advertisement -

ఫామిలీ స్టార్ కూడా గొడవల్లోనే…

ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా గొడవల్లోనే పట్టాలెక్కింది. ముందుగా డైరెక్టర్ పరశురామ్ ఈ స్టోరీని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతలతో చర్చించాడు. వాళ్లకు కథ నచ్చడంతో విజయ్ కి ఫోన్ చేసి ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేశారు. అంతా ఒకే అనుకున్న తర్వాత సడన్ గా పరుశురామ్ ప్రొడ్యూసర్స్ ను ఛేంజ్ చేశాడు. హఠాత్తుగా దిల్ రాజు నిర్మాతగా మూవీని అనౌన్స్ చేశారు. దీంతో నిర్మాతలు ఇద్దరి మధ్య ఈ ప్రాజెక్ట్ గురించి అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అయితే తరువాత డైరెక్టర్ పరశురామ్ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది. గీతా ఆర్ట్స్ వారు వెనక్కి తగ్గగా, ఫ్యామిలీ స్టార్ ( Family Star ) ప్రాజెక్ట్ పగ్గాలు దిల్ రాజు చేతికి వెళ్లాయి. పరుశురామ్ ను గీతా ఆర్ట్స్ బ్యాన్ చేస్తుందని, మళ్లీ అతనితో సినిమా చేసేదే లేదు అంటూ అల్లు అరవింద్ అన్నారట. అప్పట్లో అది పెద్ద రచ్చ అయింది. అందుకే ఇప్పుడు ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మరోసారి అల్లు అరవింద్, నాగ చైతన్య పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ రిజల్ట్ పట్ల ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ వీళ్ళిద్దరే అంటూ పరశురామ్ పై సెటైర్లు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు