Rashmika Rejected Movies : రష్మిక ఇంత మంది స్టార్ హీరోల మూవీలను రిజెక్ట్ చేసిందా..?

Rashmika Rejected Movies : నేషనల్ క్రష్ రష్మిక మందన మలయాళ మూవీ కిరిక్ పార్టీతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా “ఛలో” అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు గీత గోవిందం లాంటి మరో విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగులో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఇలా భారీ సినిమా అవకాశాలు రావడంతో ఈ బ్యూటీ తన తన కెరీయర్లో కొన్ని సినిమాలను కథ నచ్చక… మరికొన్నింటినీ సమయం కుదరక రిజెక్ట్ చేసింది. అలా రష్మిక తన కెరీర్లు రిజెక్ట్ ( Rashmika Rejected Movies ) చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. మొదట ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్రలో రష్మికను అనుకున్నారట. అందులో భాగంగా ఈమెను మూవీ యూనిట్ సంప్రదించగా ఆ సమయంలో ఈ బ్యూటీ ఇతర మూవీలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా రిజెక్ట్ చేసింది.

- Advertisement -
Vijay To Get Whopping Rs 250 Crore for His Last Film Directed by H Vinoth
Vijay To Get Whopping Rs 250 Crore for His Last Film Directed by H Vinoth

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ మాస్టర్ అనే మూవీ హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించింది. మొదట ఈ పాత్రకు రష్మికను సంప్రదించగా ఈమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.

Pooja Hegde: A special focus on her songs?
Pooja Hegde: A special focus on her songs?

ఇక ఆ తర్వాత విజయ్ “బీస్ట్” మూవీలో కూడా ఈ బ్యూటీ కి ఛాన్స్ ఇవ్వగా ఈమె రెండవ సారి కూడా విజయ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది.

#1YearForAnteSundaraniki
#1YearForAnteSundaraniki

నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి మూవీలో హీరోయిన్గా మొదట అవకాశం ఈ ముద్దుగుమ్మనే వరించింది. కాకపోతే ఆ సమయంలో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉండడంతో ఈ మూవీ ని కూడా రిజెక్ట్ చేసింది.

Celebrity Family Members That Shared Screens
Celebrity Family Members That Shared Screens

అలాగే బంగార్రాజు మూవీలో ముందు చైతన్యకు జోడిగా ఈమెని అనుకున్నారట. కాకపోతే పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదేమో అనే ఉద్దేశంతో ఈ బ్యూటీ ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.

Melodic Moves: Rashmika Mandanna's Dance Odyssey with Top Chartbusters

మహాసముద్రం మూవీ లో సిద్ధార్థ్ కి జోడిగా ఈ బ్యూటీనే మూవీ యూనిట్ అనుకోగా ఈమె కథ మొత్తం విని ఇందులో రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట.

The Rashmika Mandanna Controversies: Dissecting the Backlash and Its Roots

హిందీలో కిరాక్ పార్టీ రీమిక్ లో కూడా మొదట రష్మీకనే అనుకున్నారట. కానీ ఈమె అందులో నటించను అని చెప్పడంతో ఇందులో కృతి సనన్ ను హీరోయిన్గా ఎంచుకున్నారు.

Goutham Thinnanuri hits the ball out of the park ONE MORE TIME

హిందీ జెర్సీ లో మొదట ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్గా మూవీ యూనిట్ అనుకుందట. అందులో భాగంగా ఈమెను సంప్రదించగా ఇందులో తన పాత్రకు ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఈమె ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Distributors in competition for game changer Tamil rights

ఈ మూవీల తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా మొదట ఈ బ్యూటీ నే హీరోయిన్గా అనుకున్నారట. అందులో భాగంగా ఈమెకు ఫుల్ స్క్రిప్ట్ను వినిపించగా కథ సూపర్ గా ఉన్నప్పటికీ ఈ మూవీకి సమయం ఎక్కువ కేటాయించవలసి వస్తుంది అని ఉద్దేశంతో ఈ సినిమాలను రిజెక్ట్ చేసిందట.

The Rashmika Mandanna Controversies: Dissecting the Backlash and Its Roots

ఇక బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ గంగుబాయి కథియవాడి మూవీలో ప్రధాన పాత్రలో ఈ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బంసాలి మొదట ఈమెనే అనుకున్నారట. కాకపోతే ఈ మూవీ సమయంలో ఈమెకు వేరే సినిమాలు ఉండడం ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ సినిమా కావడంతో చాలా రోజులు సమయాన్ని కేటాయించవలసి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ మూవీని ఈ బ్యూటీ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇలా రష్మిక తన కెరియర్ లో ఇప్పటివరకు చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు