Bollywood Ramayan: బరిలోకి హాలీవుడ్ ఆస్కార్ విన్నర్స్..!

Bollywood Ramayan.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా బాలీవుడ్లో మరో రామాయణం తెరకెక్కబోతోంది. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించడానికి ఏకంగా హాలీవుడ్ ఆస్కార్ విన్నర్స్ ని బరిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది..

మ్యూజిక్ అందించడానికి ఆస్కార్ విన్నర్స్..
ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ కలసి ఈ భారతీయ రామాయణానికి మ్యూజిక్ చేయడానికి సిద్ధం అయ్యారట.

హన్స్ జిమ్మెర్ కెరియర్..
ఇప్పటికే హాలీవుడ్లో పలు టాప్ సినిమాలకు మ్యూజిక్ అందించారు.అందులో భాగంగానే ది లయన్ కింగ్, గ్లాడియేటర్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, ది డార్క్ నైట్, ఇన్సెప్షన్, మ్యాన్ ఆఫ్ స్టీల్, ఇంటర్ స్టెల్లార్, నో టైం టు డై, డూన్, మిషన్ ఇంపాజిబుల్ వంటి ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతం అందించారు.. ఇక బాలీవుడ్ రామాయణం కథ విన్న తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకి సంగీతం అందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం..

- Advertisement -

భారీ అంచనాలు..
ఇకపోతే ఇలా ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ కలిసి ఇస్తున్న మ్యూజిక్ తో రాముని గాథ ఎలా ఉండబోతుందో చూడడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమాని ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు.. జూన్ , జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు..

బాలీవుడ్ రామాయణంలో స్టార్ కాస్ట్..
ఇకపోతే హిందీలో తెరకెక్కిస్తున్న ఈ రామాయణంలో నటించేందుకు పెద్దపెద్ద సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇక అందులో భాగంగానే కేజిఎఫ్ సినిమాలతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమను పాన్ ఇండియా వ్యాప్తంగా పరిచయం చేసిన అప్పటి ప్రముఖ సీరియల్ హీరో , ఇప్పుడు పాన్ ఇండియా హీరో యష్ రావణాసురుడిగా నటించబోతున్నారు.. హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తూ ఉండగా.. కైకేయి గా లారా దత్తా నటిస్తున్నట్లు సమాచారం.. అలాగే రావణాసురుడు సోదరి శూర్పనక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. మరి ఇంతమంది భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

రామాయణం..
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రామాయణం కథలను తెరకెక్కించడానికి ఎటువంటి లిమిట్స్ లేవు. కాబట్టి ఎవరు ఎన్నిసార్లైనా తెరకెక్కించవచ్చు.. కానీ ప్రేక్షకులను మెప్పించ గలిగినప్పుడే ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటాయి. ఈ క్రమంలోనే గత ఏడాది బాలీవుడ్ డైరెక్టర్ ఓం రత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ సినిమా రామాయణం కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.. దీంతో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది..అందుకే ఇప్పుడు బాలీవుడ్ రామాయణం పైన అందరి దృష్టి పడింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు