ఐక్యూ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా..
ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి మరియు కనిపించనున్నారు. ఐక్యూ క్రియేషన్స్ పతాకంలో వినోదాత్మక చిత్రాలను రూపొందించే క్రమంలో బొడ్డు కోటేశ్వరరావుగారు తమ బేనర్ లో ప్రొడక్షన్ నెం.1 కింది శివనాగేశ్వరరావుగారితో రూపొందించిన చిత్రానికి సంబంధించిన టైటిల్ దోచేవారెవరురా.. లోగో ఉగాది సందర్భంగా రాంగోపాల్ వర్మగారితో ఆవిష్కరించారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయనున్నారు చిత్రబృందం.