Maha : హన్సికని డేట్ కి పిలిచిన ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ గెలుచుకుంది. అప్పటికే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ బొంబాయి బ్యూటీ, తెలుగులోనే డెబ్యూ సినిమా అవడం విశేషం.

దేశముదురు సినిమా రిలీజై, సూపర్ హిట్ అవడంతో హన్సికకి హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపొయింది. దేశముదురు సినిమా తరువాత హన్సిక తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కంత్రి సినిమాలో నటించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే హన్సిక ఒకే సమయంలో తెలుగులో మరియు ఇతర భాషల్లో సినిమాలు చేయడం వల్ల టాలీవుడ్ టాప్ స్టార్స్ పక్కన నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది.

ఇటీవలనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ సోహెల్ కతూరియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న హన్సిక, బాలీవుడ్ మీడియా కి ఒక ఇంటర్యూ ఇచ్చింది. అయితే ఈ ఇంటర్యూ లో ఆమెని డేట్ కోసం ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఇబ్బంది పెట్టినట్టు.. ఆమె చెప్పిందని ఒక ప్రముఖ వెబ్ సైట్ లో న్యూస్ రాసారు. ఆ న్యూస్ సోర్స్ గా చేసుకొని సోషల్ మీడియాలో.. ఆ స్టార్ హీరో అల్లు అర్జున్ అయ్యుంటాడ, లేక రామ్ పోతినేనినా, మంచు విష్ణున అంటూ, ఆమె గతంలో పని చేసిన హీరోల అందరిని పేర్లతో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ ఆ న్యూస్ లో ఏమాత్రం నిజం లేదని,తాను అలా మాట్లాడలేదని.. ఎందుకిలా ఫేక్ న్యూస్ లు రాస్తారని హన్సిక ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు