Takkar: దివ్యాంశకు లవర్ భాయ్ సిద్ధునే లాస్ట్ ఆప్షన్… ?

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే అందం ఒకటే ఉంటే సరిపోదు. కావాల్సినంత లక్ కూడా కలసిరావాలి. అలా బోలడంత అందం ఉండి, లక్ లేక ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో దివ్యాంశ కౌశిక్ ఒకరు. మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నా, ఈమెకి హిట్స్ మాత్రం పడటం లేదు. తెలుగులో నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది దివ్యాంశ కౌశిక్ .

మజిలీ సినిమాలో దివ్యాంశ కౌశిక్ నటన అందరిని ఆకట్టుకున్నా, నాగ చైతన్య, సమంత ముందు దివ్యాంశ మంత్రం ఏ మాత్రం పని చేయలేదు. దీంతో ఈమెకు ఎక్కువ క్రెడిట్ ఏమి రాలేదు.ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి ది వైఫ్ అనే సినిమా చేసింది. ఇది కూడా నిరాశపరచడంతో మళ్లీ తెలుగుతెరపైకి వచ్చింది. రవితేజతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఛాన్స్ కొట్టింది. కానీ, రవితేజ కూడా ఈమె కెరీర్ కు ఏ మాత్రం సాయం చేయలేకపోయాడు. దీని తర్వాత సందీప్ కిషన్ భారీ అంచనాలు పెట్టుకున్న మైఖైల్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది దివ్యాంశ. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్ లాంటి భారీ కాస్ట్ ఉండటంతో దివ్యాంశ కెరీర్ లో ఫస్ట్ హిట్ పడినట్టే అని అందరూ అనుకున్నారు.

తీరా చూస్తే మైఖైల్ కూడా దివ్యాంశను దారుణంగా నిరుత్సాహపరిచింది. దీని తర్వాత దివ్యాంశకు సినిమా ఛాన్స్ లు రావడం కష్టమే అనుకునే సమయంలో లవర్ భాయ్ సిద్ధు నటిస్తున్న టక్కర్ మూవీలో ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 9న విడుదల కాబోతుంది. ఈ చిత్రం సిద్ధార్థ్ కంటే, దివ్యాంశ కెరీర్ కే చాలా ముఖ్యం. ఈ సినిమా హిట్ కొడితే, ఇటు తెలుగు, అటు తమిళంలో దివ్యాంశ ప్రభావం ఉంటుంది. దీంతో అవకాశాలు రావొచ్చు. కెరీర్ ఊపందుకొవచ్చు. దీంతో ఈ అమ్మడు సిద్ధార్థ్ పైనే భారీ అంచనాలు పెట్టుకుంది. మరి సిద్ధార్థ్ అయినా, ఈమెను కాపాడతాడా ? లేదో చూడాలి మరి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు