Dead pixels : హద్దులు దాటేస్తున్న నిహారిక..ఇది దేనికి సంకేతం?

మెగా డాటర్ నిహారిక, గత కొన్నిరోజుల నుంచి తెగ వార్తల్లో నిలుస్తుంది. దీనికి ఒక కారణం.. తన భర్త చైతన్యతో డైవర్స్ తీసుకోబోతుందంటూ వస్తున్న రూమర్స్, మరొకటి… ఈమె గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న తీరు. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తప్పు కాదు.. అలాగే దాంతో పెద్దగా వార్తలు కూడా రావు. కానీ, డైవర్స్ గురించి రూమర్స్ వచ్చే సమయంలో భర్తతో ఉండకుండా, గ్లామర్ షో చేస్తూ ఫోటోలు పెట్టడం, వివిధ అర్థాలు వచ్చేలా పోస్ట్ లు పెట్టడంతో ఈ మెగా డాటర్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.

డైవర్స్ రూమర్స్ గురించి ఇప్పటి వరకు అటు చైతన్య ఫ్యామిలీ గానీ, ఇటు మెగా ఫ్యామిలీ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో డైవర్స్ దాదాపు ఖాయమే అని అనుకుంటున్నారు అంతా. అలాగే ఈ మధ్య కాలంలో చైతన్య ఫ్యామిలీ తిరుపతికి వెళ్లారు. అక్కడ చైతన్య తో పాటు ఆయన తల్లిదండ్రలు మాత్రమే ఉన్నారు. నిహారిక కనిపించలేదు. దీంతో చైతన్య, నిహారిక విడివిడిగా ఉంటున్నారు అంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలను అన్నింటినీ పక్కనపెట్టిన నిహారిక, ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోలు పెట్టడం, రాబోయే సినిమా ప్రమోషన్లు, నటనతో బిజీ బిజీగా గడిపేస్తుంది.

తాజాగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. యెల్లో గౌన్ లో ఉన్న ఈ ఫోటోల్లో నిహారిక… బ్యాక్ అందాలను అరబోస్తూ, రొమాంటిక్ ఫోజులిస్తూ.. కుర్రకారును రెచ్చగొడుతుంది. స్కిన్ షో తక్కువ ఉన్నా, ఎందుకో ఈ మెగా డాటర్ ఈ ఫోటో షూట్ లో హద్దులు దాటింది అంటూ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇలా వరుసగా హాట్ ఫోట్ షూట్స్ వల్ల .. తాను ఫ్రీగా ఉన్నానని, తనకు ఎలాంటి ఒత్తడి లేదు అంటూ ఓ మెసేజ్ ఇస్తున్నట్టు అర్థమవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు