Kollywood: విజయ్ స్టార్ అయింది తెలుగు సినిమాలతోనే అని తెలుసా ?

దళపతి విజయ్. ఇప్పుడు ఈ పేరు సౌత్ లో తెలియని వారు లేరు. టాక్ ఎలా ఉన్న ఫ్యాన్ బేస్ బలం తోనే హిట్లు కొట్టగల హీరో ఇతను. తుపాకీ, అదిరింది, విజిల్, మాస్టర్, వారసుడు లాంటి చిత్రాలతో తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించాడు. అయితే టాలీవుడ్ హీరోలను గత కొంత కాలంగా విజయ్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ను తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి కౌంటర్ గా మహేష్, పవన్ ఫ్యాన్స్ కూడా బదులిస్తున్నారు. అయితే ఇళయ దళపతి గా ఇంత స్టార్ డమ్ ని అనుభవిస్తున్నవిజయ్ అసలు స్టార్ హీరోగా అయ్యింది తెలుగు సినిమాలతోనే అని ఎంతమందికి తెలుసు.

విజయ్ నటించిన కొన్ని రీమేక్ చిత్రాల ద్వారానే అతను తమిళ నాట టాప్ స్టార్ అయ్యాడు. తమిళ డైరెక్టర్ S.A చంద్రశేఖర్ కొడుకుగా విజయ్ 1992 లో “నాలైయా తీర్పు” అనే తమిళ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 1994 లో వచ్చిన రాసిగన్ అనే సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. 1996 లో వచ్చిన “పూవే ఉనక్కగా” సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి తన కంటూ ఓ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత “తుళ్లదా మనుమ్ తుళ్ళం”, “లవ్ టుడే” లాంటి చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా నిలబడ్డాడు. అయితే ఎన్ని హిట్లోచ్చిన ఇండస్ట్రీ లో ఒక టాప్ స్టార్ గా నిలవాలంటే మాత్రం మాస్ కమర్షియల్ హిట్లు కావాలి.

అలాంటి సినిమా కోసం విజయ్ చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. అదే ‘గిల్లి’ సినిమా. 2004 లో వచ్చిన ఈ సినిమా విజయ్ ని టాప్ స్టార్ గా తమిళ నాట నిలిపింది. రజిని కాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ హీరోగా ఈ సినిమా తో గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన మహేష్ బాబు ఒక్కడు సినిమా కి రీమేక్. తమిళంలో నరసింహ సినిమా తరువాత ఆ స్థాయి విజయం గా ఈ సినిమా నిలిచింది. ఇక ఆ తర్వాత 2007 లో వచ్చిన పొక్కిరి సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తెలుగు లో ఇండస్ట్రీ హిట్ అయిన పోకిరి కి రీమేక్ కావడం విశేషం. అంతే కాదు తెలుగులో వచ్చిన చిరు నవ్వుతో,పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు,వెంకటేష్ పవిత్రబంధం,నువ్వు నాకు నచ్చావ్,ఇంకా పెళ్లి సందడి, అతనొక్కడే సినిమాలను అక్కడ రీమేక్ చేసి సూపర్ హిట్లు కొట్టాడు.

- Advertisement -

ఏది ఏమైనా రీమేక్ లు అనేవి ప్రతి ఇండస్ట్రీ లోను చాలా కామన్. విజయ్ కూడా ఒక రీమేక్ సినిమాతో స్టార్ అయ్యాడని ఫ్యాన్స్ గుర్తించుకోవాలి. 2023 లో పొంగల్ కి వారిసు సినిమా తో హిట్ కొట్టిన విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో “లియో” అనే సినిమా చేస్తున్నాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు