Selva raghavan : 7జి బృందావన కాలని పార్ట్ 2 ?

7జి బృందావన కాలని సినిమా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా 90’స్ కిడ్స్ మేము అని చెప్పుకునే ఇప్పటి యూత్ కి ఐతే ఈ సినిమా ఎవర్గ్రీన్ ఫేవరెట్. ఈ రోజుకి కూడా ఈ సినిమా పాటలని కాలర్ ట్యూన్ గా, రింగ్ టోన్ లుగా పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు. మరి అంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా పార్ట్ 2 రాబోతుందని మీకు తెల్సా ?

అవును ! సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రముఖ నిర్మాత ఏయమ్ రత్నం కొడుకు రవి కృష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. రవి కృష్ణ కి జోడీగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 20004 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయింది. సెల్వ రాఘవన్ ఈ సినిమాలో మిడిల్ క్లాస్ లైఫ్ ని కళ్ళకి కట్టినట్టు చూపించారు. తమిళ్ , తెలుగు రెండు భాషల్లో ఒకేసారి తీసిన ఈ సినిమా ముందు తమిళ్ లో 7జి రెయిన్బో కాలని పేరుతో రిలీజ్ చేసారు. తమిళ్ లో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తెలుగులో బృందావన కాలని పేరుతో రిలీజ్ చేసారు.ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

అయితే ఈ సినిమా తరువాత డైరెక్టర్ సెల్వ రాఘవన్ తమిళ్ మరియు తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు.హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం సినిమాలలో బిజీ హీరోయిన్ గా మారింది. హీరో రవి కృష్ణ 7జి బృందావన కాలని సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. కానీ ఈ సినిమా మినహా తరువాత రవి కృష్ణ చేసిన ఏ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. హీరోయిన్ సోనియా కూడా హీరోయిన్ గా నిలదొక్కుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తుంది. అయితే రవి కృష్ణ మాత్రం సినిమాలు ఏమీ లేక ఖాళీ ఐపోయాడు.
ఐతే ప్రస్తుతం సినీ పరిశ్రమలో పార్ట్ 2 ల ట్రెండ్ నడుస్తుండడంతో రవి కృష్ణ కూడా తనని హీరోగా నిలబెట్టిన 7జి బృందావన కాలని సినిమాకి పార్ట్ 2 చేయబోతున్నారంట. ఇప్పటికే సెల్వ రాఘవన్ సినిమా స్క్రిప్ట్ కంప్లిట్ చేసారంట. ఈ ఏడాది జూన్ నుంచి షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని కూడా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయబోతున్నరంట, రవి కృష్ణ ఫాదర్ ఏయమ్ రత్నం ఈ సినిమాని నిర్మించబోతున్నారు. అప్పటికి ,ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి మరి 7జి బృందావన కాలని అప్పటి మ్యాజిక్ ని రి-క్రియేట్ చేస్తుందో లెదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు