Dasara : నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా. ఈ సినిమాపై నాని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దసరా సినిమా కోసం నాని చాలా కష్టపడ్డాడు. మునుపెన్నడూ కనిపించనంత ఉరమాస్ లుక్ లో కనిపించనున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 30న రిలీజ్ కానున్న దసరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లు దొరికాయి. కానీ కెరీర్ లోని అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాగా దసరా నిలవనుంది.

ఈ సినిమాపై నెలకొన్న హైప్ దృష్ట్యా ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నేపథ్య కథాంశంతో కెరీర్ లో తొలిసారి నాని నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం నాని, కీర్తి సురేష్ ఇద్దరు తెలంగాణ యాస నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పారు. దసరా పాన్ ఇండియ లెవెల్ లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాలో పావుగంటపైగా క్లైమాక్స్ ఉంటుందని, క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ తో సాగుతూ ఫైట్స్ ఉంటాయని అంటున్నారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నాని మంచి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం నాని 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్ ను రాబట్టి కేక పెట్టించింది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ నెటిజన్స్ కు మంచి కిక్ ను ఇస్తున్నాయి.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు