SSMB28: ప్రిన్స్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ రెడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే విడుదలైన ssmb28 ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. రఫ్ లుక్ తో సిగిరెట్ తాగుతూ రోడ్డు పై నడుస్తున్నమహేష్ స్టిల్ అదిరిపోయిందని మహేష్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నామని మేకర్స్ ఫస్ట్ లుక్ లో చెప్పారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కి మహేష్, పూజా, థమన్ ఈ ముగ్గురి తోనూ మూడో సినిమా. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీం నుంచి మరో వార్త బయటకి వచ్చింది. “మే 31” సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. ఆయన పుట్టిన రోజు సందర్బంగా ప్రతిసారి మహేష్ సినిమాకి సంబంధించిన ఏదైనా ఒక ఫస్ట్ లుక్ గాని, టీజర్ గాని రిలీజ్ చేస్తారు. అదే విధంగా ఈ సినిమా కు కూడా ఒక అప్డేట్ ని విడుదల చేస్తామని త్రివిక్రమ్ సన్నిహితుడు నిర్మాత నాగవంశీ ప్రకటించారు.

- Advertisement -

అయితే ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అన్నది రివీల్ చెయ్యలేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని లేదా సాంగ్ ని విడుదల చేస్తారని అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి చాలా మంచి న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా అప్డేట్స్ ఇంత తొందరగా బయటికి రావట్లేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్  లు ఇస్తూ టీం మేకర్స్ సినిమాని నిత్యం ట్రెండింగ్లో ఉంచుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు