Rapo20: రసవత్తరంగా మారిన 2023 దసరా

టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం సంక్రాంతికి, దసరా కి సినిమాలు సందడి చేయడానికి వస్తాయి. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి పోటీగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఇంకా డబ్బింగ్ సినిమాలు వారసుడు, తెగింపు విడుదల అయ్యాయి. అందులో “వాల్తేరు వీరయ్య” విన్నర్ గా నిలిచింది.

అలాగే సంక్రాంతి తర్వాత పెద్ద పండుగ దసరా. ఈ పండగకి కూడా ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రేసులో నిలుస్తాయి. ఇప్పటికే రెండు సినిమాలు దసరా డేట్స్ ని లాక్ చేసుకున్నాయి. తమిళ స్టార్ విజయ్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా లియో. మాస్టర్ సినిమా తర్వాత వీరి కాంబో లో వస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు దాటిపోయిన ఈ సినిమా 2023 అక్టోబర్ 19 న విడుదల అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు.

అలాగే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని తో చేస్తున్న సినిమా కూడా దసరా పోటీలో విడుదల అవుతుందని నిర్మాతలు తాజాగా ప్రకటించడం జరిగింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాని ఈ సినిమాను అక్టోబర్ 20 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ప్రకటించారు.

- Advertisement -

తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమా కూడా కూడా ఇదేరోజున విడుదలకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కూడా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ మధ్యే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కూడా అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ ని ఇంకా ఆఫీషియల్ గా ప్రకటించకపోయినా దసరా కానుకగా మాత్రం ఖచ్చితంగా విడుదల చెయ్యాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూడు సినిమాలపై కూడా ఇండస్ట్రీ లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ దసరా పోటీలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు