Cinema politics: ఆ పార్టీ కోసం రంగంలోకి దిగిన బన్నీ జంట.. వీడియో వైరల్..!

Cinema politics..తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంతంగా ఒక బ్రాండ్ ని ఏర్పరచుకున్నారు అల్లు అర్జున్.. తను నటిస్తున్న ప్రతి సినిమాతో కూడా తన రేంజ్ పెరిగేలా సక్సెస్ సాధిస్తూ ఉన్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉంటారు.. అలాగే పొలిటికల్ పరంగా కూడా దూరంగానే ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

Cinema politics..Bunny couple who entered the field for the party.. Video viral..!
Cinema politics..Bunny couple who entered the field for the party.. Video viral..!

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న అల్లు అర్జున్…

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించారు. అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. అక్కడే అల్లు అర్జున్ జాతీయ జెండాతో ర్యాలీ కూడా చేశారట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల హడావిడితో కొంతమంది ఈ వీడియోని ఎడిట్ చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అల్లు అర్జున్ అంటూ వీడియోలను పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అభిమానులు సిల్లీగా కామెంట్స్ చేస్తున్నారు.

వార్తలకు కారణం అదే..

ముఖ్యంగా అల్లు అర్జున్ మామ కూడా పాలిటిక్స్ లో ఉండడంతో ఈ విషయం మరింత హట్ టాపిక్ గా మారుతోంది. అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. ఇందులో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది.. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

అల్లు అర్జున్ సినిమాలు..

పుష్ప సినిమాతో ఇతర దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఈసారి అంతకుమించి పుష్ప-2 చిత్రంతో రాబోతున్నారు.. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. స్పెషల్ సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని వెతుకుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం మరి ఇందులో నటీనటులను ఎవరిని ఎంపిక చేసుకోబోతున్నారో చూడాలి. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య తన సినిమాలను విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు బన్నీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు