100 Days for Hanuman : హనుమాన్ కు 100 రోజులు… కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యమని నిరూపించిన సినిమా

100 Days for Hanuman : యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజా సజ్జ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ నేటితో హిస్టారికల్ మైలురాయిని చేరింది. కంటెంట్ ఉంటే కటౌట్ తో పని లేదని నిరూపించిన ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈరోజుతో 100 రోజులు పూర్తయింది. చిన్న సినిమా గా రిలీజై సంక్రాంతి రికార్డులు బద్దలు కొట్టిన హనుమాన్ మూవీ ఇంకా ఎన్ని థియేటర్లలో ఆడుతుందో తెలుసుకుందాం.

100 డేస్ థియేట్రికల్ రన్ కంప్లీట్

తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. గుంటూరు కారం లాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ పోటీగా రిలీజ్ అయినప్పటికీ హనుమాన్ మూవీకే ప్రేక్షకాదరణ లభించింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ అదిరిపోయే విజువల్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ మనసులు గెలుచుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా అవతరించింది. హనుమాన్ రిఫరెన్స్ తో తెరకెక్కిన హనుమాన్ మూవీ కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, దాదాపు 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి నిర్మాతలకు ఫుల్ ప్రాఫిట్స్ అందించింది. అయితే సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాలు మాత్రమే థియేటర్లో ఆడుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా ఓటిటిలో దర్శనమిస్తుంది. కానీ హనుమాన్ మూవీ మాత్రం ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది.

ఇంకా ఎన్ని సెంటర్స్ లో ఆడుతోదంటే…

ఇదివరకు సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే 100 రోజులు లేదా కనీసం 50 రోజులు ఆడితేనే ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరెక్ట్ గా రెండు వారాలు సినిమా ఆడితే చాలు బ్లాక్ బస్టర్ అంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు. కానీ హనుమాన్ మూవీ మాత్రం మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. దాదాపు 300 సెంటర్స్ లో ఈ మూవీ 30 రోజులు ఆడడం ఆడింది. ఇక ఆ తర్వాత కూడా 150 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈరోజుతో వంద రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న హనుమాన్ మూవీ ఇంకా ఇప్పటికి 25 సెంటర్స్ లో ఆడుతుండడం విశేషం. తాజాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ హనుమాన్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఓటిటిలోకి వచ్చాక కూడా హనుమాన్ ఇంకా థియేటర్లలో సందడి చేస్తుండడం మామూలు విషయం కాదు.

- Advertisement -

డైరెక్టర్ స్పెషల్ పోస్ట్

హనుమాన్ సినిమా విడుదలై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లో ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

సీక్వెల్ 2025లో…

జనవరి 12న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ మూవీ ముగింపులో సీక్వెల్ ఉంటుందని అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసింది. జై హనుమాన్ పేరుతో సీక్వెల్ ను రూపొందించబోతున్నారు. హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటి అనే స్టోరీ లైన్ తో సీక్వెల్ ను 2025లో థియేటర్లోకి తీసుకురాబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు