Masooda: పెళ్లి పీటలెక్కిన మసూద నటుడు..!

Masooda.. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్.. ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు తాజాగా మసూద సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు తిరువీర్ రెడ్డి కూడా ఇటీవల పెళ్లి పీటలెక్కినట్లుగా తెలుస్తోంది.. అందుకు సంబంధించి హెల్దీ, మెహందీ వేడుకల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నటుడు తిరువీర్ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు ఒకసారి మనం చూద్దాం.

Masooda: Actor Masooda got married..!
Masooda: Actor Masooda got married..!

తిరువీర్ సినిమాలు.

తిరువీర్ రెడ్డి మొదట బొమ్మల రామాయణం అనే చిత్రం ద్వారా యాక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు.. అయితే ఇందులో మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా విలన్ గా నటించారు. ముఖ్యంగా జార్జి రెడ్డి అనే చిత్రంలో విలన్ గా నటించడంతో మంచి క్రేజ్ అందుకున్నారు. అలాగే రానా నటించిన ఘాజి చిత్రంలో కూడా చిన్న పాత్రలో నటించారు. నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో విలన్ గా నటించడమే.. ఈయన కెరియర్ కు మలుపు తిరిగింది.

మసూద తో మలుపు..

హర్రర్ బెస్ట్ మూవీ గా పేరుపొందిన మసూద సినిమాలో హీరోగా అవకాశం రావడంతో ఈ సినిమాని ఒప్పుకున్న తిరువీర్ హీరోగా సక్సెస్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే ట్యాగ్ ను తీసేసి హీరోగా పేరు సంపాదించారు తిరువీర్.. ఆ తర్వాత పరేషాన్ అనే చిత్రంతో మరొకసారి ఆకట్టుకున్నారు.. అయితే అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇలా వివాహ బంధంలో అడుగు పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తిరువీర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు కల్పనారావు.. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహమా..? అరేంజ్డ్ మ్యారేజ్ అనే విషయం మాత్రం తెలియదు.. కానీ ప్రస్తుతం తిరువీర్ తన సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.. దీనితో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

రాబోయే సినిమాలు..

తిరువీర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. పారా హుషార్, మోక్షపటం ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.. అలాగే మసూద సీక్వెల్లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కెరియర్ పరంగా ప్లాన్ చేసుకుంటూ మంచి మంచి కథలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తిరువీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సినిమాలలోనే కాకుండా ఓటీటీ లో కూడా పలు రకాల వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగానే పేరు సంపాదిస్తున్నారు తిరువీర్.

ఏది ఏమైనా ఇన్ని రోజులు బ్యాచిలర్ లైఫ్ అనుభవించిన తిరువీర్ రెడ్డి ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. త్వరలోనే ఆ శుభవార్త కూడా చెప్పాలంటే అభిమానులు కోరుతున్నారు.. అలాగే సినిమాలలో వరుస అవకాశాలు అందుకొని స్టార్ పొజిషన్ కి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఇకనైనా తిరువీర్ రెడ్డి కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు