13 Years For Mr Perfect : 13 ఏళ్లు పూర్తి… మిస్టర్ పర్ఫెక్ట్ గురించి ఈ విషయాలు తెలుసా?

13 Years For Mr Perfect : ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వరుసగా డిజాస్టర్లు అందుకున్న ప్రభాస్ కు హిట్ ఇచ్చి, ఊపిరి పీల్చుకునేలా చేసిన మూవీ డార్లింగ్. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు రెబల్ స్టార్. నేటితో ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీకి 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

13 ఏళ్ళు కంప్లీట్

ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ పర్ఫెక్ట్. దశరథ్ దశకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. 2011లో ఏప్రిల్ 22న రిలీజ్ అయిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రభాస్ కు మున్నా మూవీతో డిజాస్టర్ ను అందించిన దిల్ రాజు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో ఆ లోటును తీర్చేశాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈరోజుతో 13 ఏళ్లు పూర్తి కావస్తోంది. మరి ఈ సందర్భంగా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ఫుల్ రన్ లో అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది? ముందుగా ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారు? అనే ఆసక్తికరమైన సంగతులపై ఓ లుక్కేద్దాం.

1. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీకి అప్పట్లో 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, ఫుల్ రన్ ముగిసేసరికి 27.92 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు ఈ మూవీ 7 కోట్ల పైగా లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

- Advertisement -

2. ప్రభాస్ కెరియర్ లోనే ఇదే అప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ.

3. ముందుగా ఏ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారట. దాదాపు 5 రోజుల పాటు షూటింగ్ జరిగిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఆ రోల్ కు సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఆమెను తప్పించి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తీసుకున్నారట మేకర్స్.

4. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తమిళ, హిందీ, మలయాళంతో పాటు పలు భాషల్లోకి రిమేక్ చేశారు. హిందీలో నెంబర్ 1 పర్ఫెక్ట్ అనే టైటిల్ తో 2013లో రిలీజ్ అయింది.

5. మిస్టర్ పర్ఫెక్ట్ నాగిరెడ్డి స్మారక అవార్డును గెలుచుకున్న ఫస్ట్ మూవీ. అలాగే ఈ మూవీకి గానూ బెస్ట్ యాక్ట్రస్ గా తాప్సీ పన్నును సంతోషం ఫిలిం అవార్డు వరించింది. అలాగే ఈ సినిమాలోని చలి చలిగా పాటకు శ్రేయ ఘోషల్ మూడు అవార్డులను అందుకుంది.

5. ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కాపీ వివాదంలో కూడా చిక్కుకుంది. నా మది కోరింది నిన్నే అనే తన నవల నుంచి కాపీ కొట్టారంటూ ప్రముఖ రచయిత్రి శ్యామల దేవి కోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత అదే నిజమని తేలింది కూడా.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు