Chandramukhi 2: ఐదుగురు హీరోయిన్లతో ?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హారర్ మూవీ “చంద్రముఖి” సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్, ప్రభ, జ్యోతిక, నయనతార తమ నటనలతో ఈ సినిమాలో అదరగొట్టారు. పి వాసు దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ సినిమా కి 17 ఏళ్ల తర్వాత సీక్వెల్ రానుంది. చంద్రముఖి మొదటి భాగాన్ని తెరకెక్కించిన పి వాసు ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే హర్రర్ సినిమాలతో వరుసగా హిట్లు కొడుతున్న రాఘవా లారెన్స్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

అయితే చంద్రముఖి సినిమాలో జ్యోతిక, నయనతార కీ రోల్ లో కనిపించారు. కానీ “చంద్రముఖి 2” లో వీరిద్దరూ ఉండబోరని సమాచారం. కానీ ఈ మూవీలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఓ హీరోయిన్ గా నంబియార్ ను ఎంపిక చేయగా, మిగతా వారి కోసం సెర్చ్ చేస్తున్నారని టాక్. టాలీవుడ్ నుండి ఓ ఇద్దరూ కొత్త హీరోయిన్లు ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ఐదుగురు హీరోయిన్ల పేర్లు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో లెజెండరీ కమెడియన్ వడివేలు మరోసారి కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు