OTT: పది వారాల తర్వాతే

టాలీవుడ్ లో కొన్ని రోజుల నుంచి నిర్మాతలు సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. రెమ్యునరేషన్ లు, నిర్మాణ ఖర్చులు తగ్గించాలని ప్రతి రోజు సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్ లను నిలిపివేయాలని నిర్మాతల మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఓటీటీ రిలీజ్ పై కూడా నిర్ణయం తీసుకున్నారు.

పెద్ద సినిమాలు ఓటీటీలో కనీసం పది వారాల తర్వాతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. రూ. 6 కోట్ల లోపు బడ్జెట్ తో వచ్చే సినిమాలు ఓటీటీ విడుదల పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు నిర్మాతల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినిమా ప్రదర్శన కోసం చెల్లించే వీపీఎఫ్ ఛార్జీలను ఇక నుండి ఎగ్జిబిటర్లే చెల్లించాలి. టికెట్ల ధరలు సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి.

సీ క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ. 70, రూ. 100 ఉండాలి. మల్టీ ఫ్లెక్స్ లో రూ. 125, రూ. 150 ( జీఎస్టీతో కలుపుకుని) ఉండాలి. సినిమా నిర్మాణ వ్యయాలు కూడా నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ తో చర్చించిన తర్వాతే పెంచుకోవాలి. కాగ, నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలతో ఆగస్టు 1 నుంచి సినిమాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి. దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పెద్ద సినిమాలకు కొంత మేరకు ఇబ్బంది కలగవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు