Bollywood : మరో బాయ్ కాట్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ లైగర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఆగస్టు 25న లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న లైగర్ తో అటు టాలీవుడ్ కు అనన్య, ఇటు బాలీవుడ్ కు విజయ్ ఒకేసారి పరిచయం కానున్నారు.

ఇది ఇలా ఉండగా, ఈ సినిమాపై ప్రస్తుతం హిందీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీనికి రెండు కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి కరణ్ జోహార్. మరొకటి హీరోయిన్ అనన్య పాండే. ఇద్దరు బాలీవుడ్ కు చెందిన వారే. కరణ్ పై బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆగ్రహంగా ఉన్నారు. సీనియర్ యాక్టర్ చుంకి పాండే కుమార్తెగా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అనన్యపై కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.

వీటితో పాటు లైగర్ పై మరో వివాదం మొదలైంది. అది ఏంటంటే.. బాలీవుడ్ లో ఇటీవల వచ్చిన లాల్ సింగ్ చడ్డా ను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ ఎక్కువగా వచ్చింది. దీనిపై ఒక సారి హీరో విజయ్ దేవరకొండ బాయ్ కాట్ చేయడం సరికాదని, దీని వల్ల చాలామంది సినీ కార్మికులు నష్టపోతారని అన్నారు. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ రౌడీ హీరో టార్గెట్ అయ్యాడు. ఈ కారణాలతో లైగర్ ను బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. #BoycottLigerMovie అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. బాయ్ కాట్ ను ఎదుర్కొని బాలీవుడ్ లో లైగర్ సక్సెస్ సాధిస్తుందా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు