సుకుమార్ లాజిక్స్ కి కేరాఫ్ అడ్రస్, మ్యాజిక్ లకు మాస్టర్.
అందరికి తెలిసిన కథను ఒక కొత్త కోణంలో చెప్పడంలో మంచి ఎక్స్పర్ట్,
ఇప్పటివరకు సుకుమార్ చేసిన ప్రతి సినిమా ఆయన స్థాయిని పెంచింది. ఎవరు ఊహించని రీతిలో హీరోలను చూపించడంలో సుక్కు ను మించినవాళ్లు లేరు.
ఆర్య సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్,
ఒకేసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఆర్య సినిమా ఒక వండర్, ప్రేమను ఇలా కూడా చూపించొచ్చా.?
ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చా అనిపించేలా ఆ సినిమాని తీశారు.
ప్రేమ రెండు అక్షరాలా మహాకావ్యం
రెండు కన్నీటి చుక్కల మహా సముద్రం
ప్రతి జీవి అన్వేషణ ప్రేమ కోసమే
ప్రతి జీవి నిరీక్షణ ప్రేమకోసమే
ప్రేమ పుట్టుకకు కారణాలు లేవు
అది ఎప్పుడో పుడుతుందో
ఎలా మొదవులుతుందో తెలియదు
అది ఒక అనంత దూరాల సుదీర్ఘ ప్రయాణం.
అనే డైలాగ్ వినగానే ఈ దర్శకుడికి ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది అని ఫిక్స్ అయిపోయారు అంతా, సుకుమార్ సృష్టించిన గీత, ఆర్య , అజయ్ కేరక్టర్స్ ఇప్పటికి కళ్ళముందు కదులాడుతాయి. మూసగా సాగుతున్న ప్రేమకథలకు ఆర్య సినిమాతో సుక్కు చెక్ పెట్టి నేటికీ 18 ఏళ్ళు.