నిజంగానే విన్నాడండోయ్

కొన్ని రోజులు ముందు వరకు ఏపీ లో సినిమా టికెట్ రేట్స్ చాలా తక్కువగా ఉండేవి. ఇప్పటికి కొన్ని థియేటర్స్ లో టికెట్ రేట్స్ తక్కువ. ఆ టికెట్ రేట్స్ పెంచమని చాలామంది తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ను కలిసి ఎన్నో చర్చలు జరిపారు.

రిపబ్లిక్ ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ తో మొదలైన ఈ టికెట్ రేట్స్ వివాదం ముదురుతూ వచ్చింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు జరుపుకోవడం, ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏపీ రాజకీయనాయకులను ప్రశ్నించడం. ఇవన్నీ జరిగిన తరువాత ఎట్టకేలకు టికెట్ రేట్స్ ను హైక్ చేసింది ఏపీ ప్రభుత్వం.

రీసెంట్ గా రిలీజైన సర్కారు వారి పాట ట్రైలర్ కు మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వినిపించే ” నేను విన్నాను – నేను ఉన్నాను” అనే
డైలాగ్ ఏపీ ప్రభుత్వానికి బాగా కనెక్ట్ అయింది. బహుశా అందుకేనెమో టికెట్స్ రేటు 45/- పెంచుకునే అవకాశం కల్పించింది. టికెట్ రేట్లపై చర్చ జరిపిన ప్రముఖులలో ప్రభాస్, మెగాస్టార్ తో మహేష్ కూడా ఒకరు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు