కరోనా మహమ్మారి తర్వాత థియేటర్ లవర్స్.. ఓటీటీ లవర్స్ గా మారిపోతున్నారు. ఇంట్లోనే ఉండి చక్కగా.. సినిమాలు అన్నీ చూసేస్తున్నారు. ప్రేక్షకుల నాడిని పట్టుకున్న ఓటీటీ ప్లాట్ ఫాంలు కూడా వారికి ఇష్టమైన కంటెంట్ తోనే సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి. అంతే కాకుండా.. ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి నెల రిలీజ్ చేేసే ఒరిజనల్స్ మూవీస్, వెబ్ సిరీస్ లీస్ట్ లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నాయి.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ప్లాట్ ఫాంలు రిలీజ్ చేసే వెబ్ సిరీస్, సినిమాలను ప్రకటించారు. తాజా గా డిస్పీ ప్లస్ హాట్ స్టార్ కూడా మే నెలలో ప్రసారం చేసేవాటిని రిలీజ్ చేసింది. రేపు లవ్ ఇన్ జంగల్ సిరీస్, ఘోస్ట్ అడ్వెంచర్ హౌస్ కాల్స్ తో పాటు మొత్తం 14 టీవీ షో లన ఈ నెలలో ప్రసారం కానున్నాయి. అలాగే మైండ్ ఫర్ డిజైన్ తో పాటు మరో రెండు కొత్త సిరీస్ లను కూడా తీసుకువస్తున్నారు.
తెలుగు ఆడియన్స్ హాలీవుడ్ మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫాంనే మొదట పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ మే నెలలో వచ్చే సిరీస్ తో హాట్ స్టార్.. సినీ లవర్స్ కు మరింత దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది