టాక్ ప్లాపు – కలక్షన్స్ తోపు

మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినిమాని నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్నపేరు ఇది. ఈయన సినిమాలు కోసం చొక్కాలు చించుకునే అభిమానులు ఉన్నారు, ఈయన సినిమాలు చూసే చాలామంది నటులుగా ఎదిగారు, ఈయన సినిమాలు చూసే చాలామంది దర్శకులుగా ఎదిగారు. ఆ స్టార్ ఇమేజ్ ఒకటి రెండు సినిమాలతో రాలేదు, ఆ మెగాస్టార్ అనే టాగ్ వెనుక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది, కృషి ఉంది.

మెగాస్టార్ అంటే చాలామంది తెలుగు ప్రేక్షకులకి తమ ఇంట్లో వ్యక్తి అయిపోయారు. ఆయన చేసిన స్వయం కృషి , ఆపత్బాంధవుడు లాంటి సినిమాలు ఆయనలోని నటుడిని బయటకు తీస్తే, ఘరానా మొగుడు , ముఠామేస్త్రి , గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు ఆయనకు ఒక మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి.

సినిమాలకి కొన్నేళ్లు టైం గ్యాప్ ఇచ్చిన , ఆయన టైమింగ్ లో మాత్రం గ్యాప్ రాలేదు.కం బ్యాక్ మూవీ “ఖైదీ 150” తో ఎన్నో రికార్డ్స్ కొల్లగొట్టారు,
రీసెంట్ గా రిలీజ్ అయినా ఆచార్య అభిమానులను నిరాశపర్చిన, కలక్షన్స్ లో మాత్రం అసలు తగ్గట్లేదు, డిజాస్టర్ టాక్ తో కూడా 77 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. దట్ ఈజ్ మెగాస్టార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు