మహప్రభో ఆదుకోండి..!

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ ఆచార్య. ఈ మూవీ భారీ అంచనాలతో గత నెల 29 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ ఫస్ట్ షో నుంచే.. నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అంతే కాకుండా.. మెగా స్టార్, డైరెక్టర్ కొరటాల శివ కెరీర్ లోనే పెద్ద డిజాస్టార్ గా కానుందని ట్రేడ్ వర్గాలు బహిరంగంగానే.. చెబుతున్నాయి.

ఆచార్య మూవీ వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగానే నష్టపోయారు. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్స్ తమను ఆదుకోవాలని మెగా స్టార్ చిరంజీవిని కొరుతున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా చాటు గానే జరిగింది. కానీ తాజా గా కన్నడ చెందిన రాజ్ గోపాల్ బజాజ్ డిస్ట్రిబ్యూటర్.. చిరంజీవి బహిరంగ లేఖ రాశాడు.

మెగా తండ్రీ కొడుకులు ఒకే సినిమాలో కనిపించబోతున్నారని ఏడాది క్రితమే.. మూవీ హక్కులను కొనుగోలు చేశామని లేఖలో తెలిపారు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా.. అప్పులు పాలైయ్యామని అన్నారు. మళ్లీ ఈ మూవీ కోసం అప్పులు చేశామని తెలిపారు. ఆచార్యకు పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా రాలేదని తెలిపాడు. తమను మెగా స్టార్ ఆదుకోవాలని లేఖలో కోరాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు