యువ హీరోతో యువత దర్శకుడు

యువత సినిమాతో దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టిన డైరెక్టర్ పరశురామ్,నారా రోహిత్ సోలో సినిమాతో మంచి హిట్ అందుకున్నారు,
ఆ సినిమాకి కథ,డైలాగ్స్ తో పాటు మణిశర్మ మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అయింది.ఆ తరువాత చేసిన సారోచ్చారు సినిమా నిరాశ పరిచిన,
అల్లు శిరీష్ తో చేసిన “శ్రీరస్తు శుభమస్తు” సినిమా పర్వాలేదు అనిపించింది. విజయదేవరకొండతో చేసిన “గీత గోవిందం” సినిమా పెద్ద హిట్ అయి భారీ కలక్షన్స్ ను కొల్లగొట్టింది.

ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” సినిమాను చేసారు పరశురామ్. ఈ సినిమా మే 12న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీటన్నిటిని మించి కళావతి పాట పెద్ద ట్రెండ్ అయింది . యూట్యూబ్ లో 160 మిళియన్స్ కు పైగా వ్యూస్ సాధించింది.ఈ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ ఉంది.

ఈ సినిమా తరువాత నాగచైతన్య తో సినిమా చేయనున్నారు పరశురామ్,
వాస్తవానికి సర్కారు కంటే ముందే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాలు వలన ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది,14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు