హైబ్రిడ్ పిల్ల‌కే ఛాన్స్.. ఇది ఫిక్స్..?

తార‌క్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా వ‌స్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ప్రీ- ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను ఎంపిక చేశారు. అయితే ఇటీవ‌ల అలియా పెళ్లి పీట‌లు ఎక్క‌డంతో.. ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. దీంతో చిత్ర బృందం మ‌రో హీరోయిన్ సెర్చింగ్ చేస్తుంది.

తాజా గా ఎన్టీఆర్ 30 గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ మూవీలో సాయి ప‌ల్లవి ఛాన్స్ కొట్టేసింద‌ట‌. ముందుగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ను ఎంపిక చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ తార‌క్ చివ‌రికి సాయి ప‌ల్ల‌వికే ఓటు వేశాడ‌ట‌. దీని గురించి ఆఫీషియ‌ల్ అనౌన్స్ రాలేదు. కానీ ఈ వార్త నిజం అయితే.. ఎన్టీఆర్ – సాయి ప‌ల్ల‌వి డాన్స్ ఈ మూవీలో హైలైట్ గా ఉండ‌నుంది.

కాగ సాయి ప‌ల్ల‌వి ఫీదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. హైబ్రిడ్ పిల్ల గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ఇటీవ‌ల వ‌చ్చిన ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు మంచి హిట్స్ అందుకుంది. అలాగే రానాతో న‌టించిన విరాట ప‌ర్వం కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. కాగ ఈ సినిమాల త‌ర్వాత సాయి పల్ల‌వి నుంచి ఇంత వ‌ర‌కు ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. సూపర్ డాన్స్, అట్రాక్టివ్ యాక్టింగ్ ఉన్న సాయి ప‌ల్ల‌వికి సినిమా అవ‌కాశాలు రాక‌పోవ‌డం అంద‌రినీ అశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ సినిమా ఓకే అయితే.. ఈ హైబ్రిడ్ పిల్ల జోష్ పెరిగే అవ‌కాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు