పాన్ ఇండియా.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రభాస్ – జక్కన్న కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమాల నుంచి టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా జపం పట్టుకున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. తెలుగు ఇండస్ట్రీ హీరోలు అందరూ.. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. తమ సినిమాలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోలు.. పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు బాహుబలి సినిమాలతో పాటు పుష్ప, ఆర్ఆర్ఆర్ ..ఎంత పెద్ద హిట్స్ అందుకున్నాయో అందిరికీ తెలుసు. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలపై ఇతర భాషాలతో పాటు హిందీ రాష్ట్రాల సినీ లవర్స్ కు ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ సినిమాలను ఆదర్శం తీసుకుని రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్, పవర్ స్టార్ హరి హర వీరమల్లు, అడవి శేషు మేజర్, సమంత యశోద సినిమాలు రిలీజ్ సిద్ధం గా ఉన్నాయి.
అలాగే యంగ్ హీరోలు నిఖిల్ కూడా తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పై అని ఇటీవల ప్రకటించాడు. తాజా గా సందీప్ కిషన్ తన పుట్టిన రోజు సందర్భంగా పాన్ ఇండియా మూవీ మైఖేల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. చుట్టు రౌడీలతో గన్ పట్టుకున్న సందీప్ ఫస్ట్ లుక్.. ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో సందీప్ తో పాటు వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగ ఈ యంగ్ హీరో ఈ పాన్ ఇండియా మూవీతో సక్సస్ అవుతాడా.. అంటే.. మరి కొద్ది రోజలుల్లో తెలిసిపోతుంది.