Bigg Boss Telugu: సూసైడ్ చేసుకోవాలనుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. అంత కష్టం ఏమొచ్చిందో..?

బిగ్ బాస్ కంటెస్టెంట్ వీ.జే.సన్నీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకొని.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి.. ప్రస్తుతం పలు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే బుల్లితెర సీరియల్స్ లో నటించక ముందు మీడియా రిపోర్టర్ గా కూడా పనిచేసిన ఈయన బుల్లితెర కార్యక్రమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచిన తర్వాతనే పలు సినిమాలలో హీరోగా అవకాశం లభించింది. త్వరలోనే ఈయన నటించిన సౌండ్ పార్టీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపడుతున్నారు. అందులో భాగంగానే బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలు తెలియజేసిన సన్నీ.. తన వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడించారు.. సన్నీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ కార్యక్రమం అంతా స్క్రిప్ట్ అనుకుంటారు అయితే అది స్క్రిప్ట్ కాదు.. బిగ్ బాస్ నుంచి తాను గెలుచుకున్నటువంటి సగం డబ్బులు టాక్స్ రూపంలో గవర్నమెంట్ కట్ చేసుకుని మిగిలిన డబ్బు మాత్రమే తనకు ఇచ్చారని వెల్లడించారు.

ఇకపోతే ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈయన గత కొద్ది రోజుల క్రితం సూసైడ్ చేసుకోవాలనుకున్నారట. అయితే ఇదే విషయాన్ని తాజాగా అడగగా ఆయన మాట్లాడుతూ.. సూసైడ్ చేసుకోలేదు.. కానీ ఒకసారి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను.ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది. దేవుడు మనకు ఈ జీవితాన్ని ఒకసారి మాత్రమే ఇస్తారు.

- Advertisement -

ఇలాంటి జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి తప్ప సూసైడ్ చేసుకోకూడదు.. నేనెప్పుడూ కూడా అలాంటి ఆలోచన చేయను.. ఒకవేళ ఎవరికైనా అలాంటి ఆలోచన వస్తే ఒకసారి మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోమని సలహా ఇస్తాను అంటూ తెలిపారు. ఇకపోతే తనకు పెళ్లి జరిగిందంటూ కూడా వార్తలు రాగా తనకు కనీసం లవర్ కూడా లేదు అని.. అయితే ఒకానొక సమయంలో ఒకప్పుడు ఒక అమ్మాయి పట్ల అట్రాక్షన్ ఉండేదే తప్ప ఇప్పటివరకు ఒకరిని కూడా ప్రేమించింది లేదు అంటూ ఈ సందర్భంగా తెలిపారు. మొత్తానికైతే వీ . జే.సన్నీ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు