Tollywood: పాపం ప్రొడ్యూసర్స్… ఆ హీరోల ముఖంపై ముడతలను కవర్ చేయడానికే సరిపోతోందా?

వెండితెరపై కనిపించే హీరోలకు ఫిజికల్ ఫిట్నెస్ మైంటైన్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మార్కెట్ దెబ్బ తినడంతో పాటు ప్రేక్షకులు కూడా వాళ్ళ సినిమాలను థియేటర్లలో చూడడానికి ముఖం చాటేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ హీరోలంతా ఇప్పటికి ఎంతో ఉత్సాహంగా సినిమాలో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు నలుగురు సీనియర్ హీరోలు కూడా 60 ఏళ్లు పైబడిన వాళ్లే. అయితే సిల్వర్ స్క్రీన్ పై మాత్రం వాళ్లు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.

దానికి కారణం సిజిఐ వర్క్. బయట హీరోలు ఎలా ఉన్నప్పటికీ సిజిఐ, డిజిటల్ కరెక్షన్ వంటి టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో మేకర్స్ హీరోలను తమకు కావాల్సినట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

సినిమాల్లో హీరోల పొట్టను తగ్గించడంతో పాటు శరీరాకృతిని వాళ్లకు కావాల్సినట్టుగా మార్చుకుంటున్నారు. అంతేకాదు డిజిటల్ ఎడిటింగ్ సహాయంతో హీరోల ముఖాన్ని సైతం మరింత బ్రైట్ గా చూపిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది? నిజానికి ఇలా చేయడం అనేది స్టార్స్ ని లేజిగా మార్చే అవకాశం ఉంది.

- Advertisement -

డిజిటల్ గా కావాల్సినట్టుగా మార్చుకోగలిగినప్పుడు ఫిజికల్ ఆపియర్ అపియరెన్స్ కోసం జిమ్లో చెమటోడ్చి కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోల విషయంలో ఇదే జరుగుతుందట. జిమ్ యాక్టివిటీ ని తగ్గించడం వల్ల టాప్ హీరోల ఫిజిక్స్ షేప్ అవుట్ అయిపోతుందని టాక్ నడుస్తోంది. కానీ ఈ డిజిటల్ కరెక్షన్ అనే ఆప్షన్ ఉండడంతో అది వాళ్లను పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు.

కానీ నిర్మాతలకు మాత్రం తడిసి పోతోంది. కేవలం డిజిటల్ గా హీరోలా ఫిజికల్ అప్పియరెన్స్ను సిల్వర్ స్క్రీన్ పై వాళ్లకు కావాల్సినట్టుగా మార్చుకోవడానికి దాదాపు ఒకటి నుంచి నాలుగు కోట్ల వరకు ఖర్చవుతుంది అట. బాలీవుడ్ లో అయితే ఇది మరింత ఎక్కువ అని చెప్పొచ్చు. సీనియర్ హీరోల ముడతలు పడిన ముఖాన్ని,

సహజ లుక్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవడం కూడా ఇలా చేయడానికి ఒక రీజన్ కావచ్చు. అయితే కొంతమంది హెవీ షెడ్యూల్స్ వల్ల సరిగ్గా నిద్రపోకపోవడం, ఇతర అలవాట్ల, ఏజ్ పెరుగుతూ ఉండడం వల్ల సీనియర్ హీరోల శరీర ఆకృతిలో మార్పులు వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సమయంలో డిజిటల్ ఎడిటింగ్ అనేది నిర్మాతలకు వరం అని చెప్పొచ్చు.

ఇటీవల కాలంలో బాడీ డబుల్స్ అనే పద్ధతి బాగా డెవలప్ అయింది. బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఫైట్ సీక్వెన్స్ లలో బాడీ డబుల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉండే సినిమాల్లో సీనియర్ హీరోల ఫేసు డిజిటల్ గా కరెక్ట్ చేయడం తప్పనిసరి అవుతుంది. అందుకే ఇటీవల కాలంలో సీనియర్ హీరోలు ముడతలు పడిన తమ మొహాన్ని యంగ్ గా చూపించుకోవడానికి సిజీ వర్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారని ప్రచారం జరుగుతుంది.

అయితే బాడీ డబుల్స్ డిజిటల్ కరెక్షన్ వంటి సాంకేతికపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ఇటీవల కాలంలో సినిమా రిలీజ్ లో ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రొడ్యూసర్స్కు భారం కూడా పెరుగుతుంది. ఈంతో పాపం ప్రొడ్యూసర్స్… ఆ హీరోల ముఖంపై ముడతలను కవర్ చేయడానికే సరిపోతోందా? అనుకోవాల్సి వస్తోంది.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు