NKB108 : భగవంత్ కేసరి మ్యాసివ్ అప్డేట్

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా, ఇటీవలనే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను విపరీతంగా పెంచింది. చాలా రోజుల తరువాత బాలయ్య నోటిలో నుంచి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ లు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

ఇటీవలనే అల్లరి నరేష్ ఉగ్రం సినిమా తీసి సూపర్ సక్సెస్ అందుకున్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రాబోతున్న భగవంత్ కేసరి సినిమా నుంచి మ్యాసిప్ అప్డేట్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మూవీ టీం. బాలీవుడ్ సుప్రసిద్ధనటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా, టాలీవుడ్ మోస్ట్ హప్పెనింగ్ యాక్ట్రెస్ శ్రీలీల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉండగా, ఖచ్చితమైన డేట్ ను మాత్రం మూవీ టీం ఇంతవరకు ఎక్కడ కన్ఫామ్ చేయలేదు. ఇక ఇప్పుడు పెట్టిన పోస్ట్ ను బట్టి చూస్తే సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే 2.30 వరకు వెయిట్ చేయాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు