NBK109 : చిరంజీవి కోసం బాలకృష్ణ అలాంటి పని చేశారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణలకి ఉన్న ఇమేజ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. వీరి సినిమాలకు ఉన్న పోటీ మరే హీరోలకు ఉండదనేది వాస్తవం. వీళ్ళిద్దరూ గత మూడు దశాబ్దాలకు పైగా ఒకరితో ఒకరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూనే ఉన్నారు. అంతేకాదు వీళ్ళిద్దరికీ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక వీరి సినిమా ఓకే సీజన్ లో విడుదలవుతుందంటే ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా ఉండదు.

చిరంజీవి – బాలకృష్ణ ఇప్పటివరకు ఇండస్ట్రీలో 11 సార్లు పోటీపడ్డారు. 1985 నుంచి ఇప్పటివరకు బరిలో పోటీ పడిన వీరు ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలతో పోటీపడ్డారు. ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి భోలాశంకర్ సినిమాతో రాబోతుంటే.. బాలకృష్ణ భగవంత్ కేసరితో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరు సీనియర్ హీరోల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఇద్దరు హీరోలు వారి సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి పని చేశారు. అయితే చిరంజీవి అప్పట్లో తనతో వరుస సినిమాలు చేసిన ఓ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని భావించారట. ఆ హీరోయిన్ కి బాలకృష్ణ తో మంచి స్నేహం ఉండేదట. ఆ సమయంలో వీరి ప్రేమకు బాలకృష్ణ అండగా నిలిచారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖని వివాహం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఆ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీని వదిలి చెన్నై వెళ్ళిపోయిందట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు