#NITHIN32: వక్కంతం వంశీ ఈ సినిమాతోనైన హిట్ కొడతాడా ?

టాలీవుడ్ లో పాపులర్ స్క్రీన్ రైటర్ గా పేరున్న వక్కంతం వంశీ గురించి అందరికి తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ, కథనం, సంభాషణలందించిన వక్కంతం వంశీఅల్లు అర్జున్ హీరోగా నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు.

భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఇక ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ రైటర్ గా ఇండస్ట్రీలో మంచి పేరున్న వక్కంతం వంశీ డైరెక్టర్ గా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయాడు. దాంతో ఈయన కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని తనకు తాను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలన్న కసితో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది. గత కొద్దీ కాలంగా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొత్తానికి తుది దశకు చేరుకుంది. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. నితిన్ కు జోడిగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ల పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు(ఆదివారం) రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం పోస్టర్ ద్వారా ప్రకటించింది.

- Advertisement -

ఇటీవలనే వక్కంతం వంశీ అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమాకు రైటర్ గా వ్యవహరించగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కేవలం స్క్రిప్ట్ కోసమే 2కోట్ల వరకు ఖర్చు చేయించిన వక్కంతం వంశీ ఏజెంట్ స్క్రిప్ట్ విషయంలో చాలా పొరపాట్లు చేసాడని ఆయనపై నెగిటివిటి ఉండగా ఈ సినిమా హిట్ ఆయనకు కీలకం కానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు