Bhagavanth Kesari: రాయలసీమ కాకుండా… తెలంగాణ స్లాంగ్ ఎందుకు?

ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాముఖ్యత పెరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యంగ్ హీరోలు తెలంగాణ యాసతో మాట్లాడుతూ హిట్స్ కొట్టేస్తున్నారు. దీంతో సీనియర్ హీరోలు కూడా తమ సినిమాల్లో తెలంగాణ యాసను ట్రై చేశారు. చేస్తున్నారు. అయితే అది కొంత మందికి వర్కౌట్ అవుతుంది. మరి కొందరికి మైపస్‌గా మారుతుంది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన భోళా శంకర్ సినిమాలో తెలంగాణ యాసను ట్రై చేశారు. అది ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. అంతే కాదు, సినిమాకు అదొక మైనస్ అయింది. అయితే సినిమా హిట్ కాకపోవడానికి తెలంగాణ యాస ఒక్కటే కారణం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. దీని గురించి పక్కన పెడితే, ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య తన భగవంత్ కేసరి సినిమాలో తెలంగాణ యాసను ట్రై చేస్తున్నాడు.

ఈ మధ్య సినిమా నుంచి వచ్చిన టీజర్‌ను గానీ, ట్రైలర్‌ను గానీ, గమనిస్తే.. తెలంగాణ యాస భగవంత్ కేసరికి మైనస్ అయ్యే విధంగా అయితే లేదు అని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే, కొన్ని డైలాగ్స్ బాలయ్య నోటి నుంచి రావడం ఆయన అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.

- Advertisement -

అయితే భగవంత్ కేసరిలో తెలంగాణ స్లాంగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది చాలా రోజుల నుంచి సమాధానం లేని ప్రశ్నగా ఉంది. తాజాగా దీనికి ఆన్సర్ దొరికింది. రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనిల్ రావిపూడి.. బాలయ్యతో రాయలసీమ డైలాగ్స్ కాకుండా, తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్స్ ఎందుకు చెప్పించాల్సి వచ్చిందో వివరించాడు.

తెలంగాణ యాసను తీసుకోవడానికి కథపరమైన ప్రాధాన్యత లేదట. ఫ్యాన్స్ ఎప్పుడూ బాలయ్యను రాయలసీమ యాసతోనే చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ యాసలో బాలయ్య కొత్తగా కనిపిస్తాడని అన్నాడు. అంతే కాదు, బాలయ్య ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడుతాడు. తెలంగాణ యాసలో కూడా ముక్కు సూటి తనం ఉంటుంది. అందుకే నేలకొండ భగవంత్ కేసరి పాత్రకు తెలంగాణ యాసను తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇది శానా ఏళ్లు యాదుంటుందని కూడా అనిల్ రావిపూడి వివరించాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు