Dil raju : బాలయ్యతో బలగం వేణు సినిమా…!

బుల్లితెరతో పాటు దాదాపు 200 చిత్రాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకులని నవ్వించిన వేణు యేల్దండి దర్శకుడిగా మారి రూపొందించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ఇటీవల విడుదలైన బలగం సినిమా ప్రేక్షకాదరణ పొందింది.

మొదట థియేటర్లలో అదరగొట్టిన బలగం ఓటీటీలోను రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్దపెద్ద ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేసుకొని మరి బలగం సినిమాను వీక్షించడం వేణు డైరెక్షన్ టాలెంట్ కు నిదర్శనం. ఇలా ఉంటే, వేణు తన తర్వాతి ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే వేణు తన తర్వాతి ప్రాజెక్టును ఓ స్టార్ హీరోతో ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే బాలయ్య కోసం వేణు కథ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణతో సినిమా అంటే ఊర మాస్ కథ ఉండాల్సిందే. అయితే ఇప్పటికే తన కథను బాలయ్యకు వినిపించారట వేణు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో త్వరలోనే తెలియనుంది. ఒకవేళ బాలయ్య సినిమా ఓకే అయితే వేణుకు బంపర్ ఆఫర్ దక్కినట్లే. ప్రస్తుతం అనిల్ రావిపూడి తో కలిసి ఎన్.బి.కె 108 సినిమాలో నటిస్తున్నాడు బాలకృష్ణ.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు