Adipurush: ఓం రౌత్ కు తెలుగు ఆడియన్స్ అక్కర్లేదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో మైథలాజికల్ మూవీగా తెరకెక్కించిన ఈ మూవీని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ మూవీకి అజయ్ – అతుల్ మ్యూజిక్ అందించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, అలాగే దేవదత్త నాగే హనుమంతుడిగా, సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా గా నటించారు. రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో భారీ స్థాయిలో 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

తాజాగా ఆదిపురుష్ కి సంబంధించిన అఫిషియల్ ట్రైలర్ ను మే9న విడుదల చేయడం జరిగింది. టీజర్ ద్వారా వచ్చిన విమర్శలను, అలాగే ఫ్యాన్స్ అనుమానాలను ఈ ట్రైలర్ ద్వారా పోగొట్టాడు ఓం రౌత్. రిలీజ్ అయిన 24 గంటల్లో అన్ని భాషల్లోనూ కలిపి 75 మిల్లియన్లకు పైగా వ్యూస్ రాగా, ఒక్క హిందీలోనే 52 మిలియన్ల కు పైగా వ్యూస్ రాబట్టింది ఈ ట్రైలర్. దీన్ని బట్టి హిందీ ఆడియన్స్ ఈ సినిమాకోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్ధమవుతుంది. ఇక సినిమాలో గ్రాఫిక్స్ పరంగా చాలా ఛేంజ్ చేసినట్టు తెలిసిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. అక్కడక్కడా కొన్ని మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు. ఓవరాల్ గా మెప్పించేలాగానే ఉంది.

అయితే తెలుగు ఆడియన్స్ ని మాత్రం ఈ ట్రైలర్ అంతగా మెప్పించలేకపోయింది. ఆదిపురుష్ ట్రైలర్ మొత్తం బాలీవుడ్ కి అనుగుణంగా ఉండటమే దీనికి కారణం. అయితే ఎంత బాలీవుడ్ మూవీ అయినా తెలుగు స్టార్ హీరోతో చేసినపుడు ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగువారికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలి. ఇండియాలో అలా ఏమి అనిపించలేదు. పైగా ఇది పౌరాణిక గాథ కావడంతో తెలుగువారు మరింత ఫోకస్ పెట్టారు. ఇందులో డైలాగ్స్ కూడా హిందీ, సంస్కృత పదాల్లో తెలుగు మిక్స్ చేసినట్టు ఉందని పబ్లిక్ అంటున్నారు.

- Advertisement -

ఇక ట్రైలర్ లో వానర జాతిని ఆర్టిఫీషియల్ గా పాత పౌరాణిక సినిమాల్లో వానరులుగా చూపించకుండా పూర్తిగా కోతుల్లా చూపించడం తెలుగు ఆడియన్స్ కి అంతగా నచ్చలేదని తెలుస్తుంది. ఇకమీదైనా చిత్ర యూనిట్ ఈ సినిమాలో కొన్ని సీన్ల పైనా, అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు భాష ప్రాస పైన, గ్రాంథికం పైన ఫోకస్ పెట్టి డబ్బింగ్ లో చూసుకుంటే మంచిదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ మార్కెట్ ఎంత ముఖ్యమో, తెలుగు మార్కెట్ అంతకంటే ముఖ్యం. ఎందుకంటే ఆదిపురుష్ ఇక్కడ 200కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం లెక్క తప్పినా చాలా నష్టపోతారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు