Krithi shetty : నాగచైతన్య “కస్టడీ” సినిమాలో హీరోయిన్ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అక్కినేని నాగచైతన్య – వెంకట్ ప్రభు కాంబోలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కబోతున్న చిత్రం కష్టడి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మే 12వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రం స్టోరీ లైన్ చాలా గమ్మత్తుగా ఉంటుందని, స్క్రీన్ ప్లే బేస్ గా సాగుతుందని చెబుతున్నారు.

దాదాపు ఏ సినిమాలోనైనా హీరో విలన్ ని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కస్టడీలో మాత్రం హీరో విలన్ ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో శివ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు నాగచైతన్య. అలాగే ఈ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రెండవసారి కృతి శెట్టి తో రొమాన్స్ చేయబోతున్నాడు నాగచైతన్య. అయితే ఈ సినిమాలో కృతి శెట్టి నటించిన రేవతి పాత్ర కోసం ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను సంప్రదించారట. కానీ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని.. పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన.. ఈ పాత్రని రిజెక్ట్ చేసిందట.

ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అనుకున్నప్పటికీ నాగచైతన్య.. ఈ పాత్రకి కృతి శెట్టి అయితేనే బాగుంటుందని ఏరి కోరి మరి సెలెక్ట్ చేసాడంట. ఇక కృతి శెట్టి కూడా ఈ పాత్రను ఓకే చేయగానే నాగచైతన్య భలే హ్యాపీగా ఫీల్ అయ్యారట. మరి కస్టడీ మూవీతో రేవతి పాత్రలో కృతి శెట్టి ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు