BABY: కష్టం- కన్నీళ్లు కలిస్తే ఈ బేబీ

ఎవరికీ ఉండదు చెప్పండి, తమని తాము ప్రూవ్ చేసుకోవాలనే కోరిక, కానీ కోరిక పుట్టినంత సులువు కాదు కదా ఆశయాన్ని సాధించటం. ఎన్నో కష్టాలు భరించాలి, అవమానాలు సహించాలి, ఎవరేమన్నా.. ఎన్నెన్ని అనరాని మాటలన్న లోపల బాధను వ్యక్తపరచకుండ చిరు నవ్వుతో స్వీకరించాలి.

అయితే అనుకున్న గమ్యాన్ని చేరడానికి కేవలం ఇవి మాత్రం చేస్తే సరిపోతుందా అంటే కాదు, ఇది చాలదు. ఎంచుకున్న లక్యానికి చేరువయ్యే మార్గం కోసం కష్టపడాలి, దానికోసం చుట్టూ ఉన్న ప్రపంచంతో యుద్ధం చేయాలి. అలా చేసి, నిలిచినా వారే చివరికి విజేతలుగా నిలుస్తారు.

అయితే ఈ మాటలన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ వారమే బేబీ సినిమా రిలీజ్ అవబోతుంది. దాదాపు మూడేళ్ళ నుంచి కష్టపడుతూ.. వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి పడిన కొంతమంది కష్టం, వాళ్ళు కార్చిన కన్నీరే ఈ బేబీ.

- Advertisement -

తనలో ఒక మంచి దర్శకుడు ఉన్నాడని అది ప్రపంచానికి తెలియజేయాలనే ఒక దర్శకుడి తాపత్రయం ఈ బేబీ

ఎక్కడో పల్లెటూళ్ళో పుట్టి ఎన్నో కలలతో హైద్రాబాద్ చేరి తనలో ఉన్న నటిని ప్రూవ్ చేసుకోవాలనుకునే ఒక తెలుగమ్మాయి కల ఈ బేబీ

చేతికందిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎదో ఒక రోజు వాళ్లలోని నటులను నిరూపించుకోవాలనే ఇద్దరు నటుల నటనకు రూపం ఈ బేబీ

స్నేహితుడి కల కోసం ఆలోచించకుండా ఖర్చు పెట్టిన ఒక నిర్మాత జేబులోని రూపాయి ఈ బేబీ

ఇలా చెప్పుకుంటూ పోతే బేబీ కార్చిన కన్నీరు చాలానే ఉంది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన తారాగణంగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కెఎన్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

బెస్ట్ విషెష్ ఫ్రామ్ ఫిల్మిఫై..

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు