GA2 New Movie launched : ఎన్టీఆర్ బావమరిది హీరోగా గ్రాండ్ ఎంట్రీ

GA2 New Movie

నందమూరి కుటుంబం నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతనెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి కి స్వయాన సోదరుడు. అతని పేరు నార్నె నితిన్. ఇటీవలనే చదువు ముగించుకొని యాక్టింగ్ పై ఆసక్తితో గత కొన్నిరోజులుగా శిక్షణ తీసుకుంటున్న ఈ యంగ్ హీరో శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ముగించుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగానే మరో సినిమా స్టార్ట్ చేసాడు యంగ్ హీరో నార్నె నితిన్.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినిడి, ఎస్కెఎన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అంజిబాబు కంచిపల్లి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ వస్తోన్న ఈ సినిమాలో నార్నె నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుంది.

యూత్ ఫుల్ లవ్ ఎంటెర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కాసేపటి క్రితమే జరిగాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాకి గౌరవ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. మ్యూజిక్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.త్వరలోనే షూటింగ్ మొదలవనున్న ఈ సినిమా గురించి మిగితా వివరాలు అఫీషియల్ రానున్న రోజుల్లో ప్రకటించనున్నారు. దేవర సినిమా షూటింగ్ పనుల వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి రాకపోగా ఆయన సతీమణి లక్మి ప్రణతి హాజరై, నార్నె నితిన్ కు విషెస్ తెలిపింది.

- Advertisement -

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు