Nani 30 Tittle Revealed : మొత్తానికి నాని న్యాచురల్ స్టార్ అని నిరూపించుకున్నాడు

Nani 30 Tittle:

మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అందించటంలో ముందుండే హీరో న్యాచురల్ స్టార్ నాని. మరీ ఏ ముహూర్తాన ఈ యంగ్ హీరోకి న్యాచురల్ స్టార్ అనే పేరు వచ్చిందో కానీ ఇక అప్పటి నుంచి నాని తన సినిమాల్లో వైవిద్యం చూపిస్తూ వస్తున్నాడు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, కొత్త కథలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు.

ఇటీవలనే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని, ఈ సినిమా తరువాత నుంచి ఇక కమర్షియల్ సినిమాలే చేస్తాడనుకున్నారు. సాధారణంగా ఒక కమర్షియల్ హిట్ వచ్చినప్పుడు అదే ధోరణిలో సినిమా చేయడం అనేది అందరు హీరోలు చేసేదే. కానీ నాని మాత్రం ఆ స్టెప్ తీసుకోలేదు.

ప్రస్తుతం నాని, శౌర్యవ్ అనే కొత్త దర్శకుడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నాని సరసన నటిస్తుంది. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి నాని 30 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

- Advertisement -

ఫాదర్ సెంటిమెంట్ తో రాబోయే నాని 30 సినిమాకు గాను హాయ్ నాన్న అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నాని ఒక 10 ఏళ్ళ పాపకి తండ్రి నటిస్తుండగా. ఆ పాపా పాత్రలో బేబీ కియారా కన్నా నటిస్తుంది. ఈ సినిమా కూడా నాని కెరీర్ లో మరో జెర్సీ సినిమాలాగే గుర్తుండిపోయే చిత్రమవుతుందని మూవీ యూనిట్ నమ్మకంగా ఉన్నారు.

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు