Sai rajesh: బేబీ టీం కు అల్లు అర్జున్ స్పెషల్ ట్రీట్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన బేబీ ఒక పక్క బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తూనే, పలువురి ప్రశంశలు కూడా అందుకుంటుంది. ఇటీవలనే డైరెక్టర్ సుకుమార్ బేబీ సినిమా చూసి మూవీ టీం కు తన బెస్ట్ విషెష్ తెలియజేయగా ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ కూడా బేబీ మూవీ టీం ను అభినందించబోతున్నడని తెలుస్తోంది.

అయితే డైరెక్టర్ సుకుమార్ బేబీ మూవీ టీం ను తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా అబినందించగా, అల్లు అర్జున్ మాత్రం బేబీ మూవీ టీంకు ఏకంగా ఒక పెద్ద పార్టీనే ఇవ్వబోతున్నాడు. థియేటర్ లో ఒక సినిమా రిలీజై, ప్రేక్షకాదరణ పొందుతుందంటే ఆ సినిమా ఖచ్చితంగా చూసి ఆ మూవీ టీం కు తప్పకుండ తన బెస్ట్ విషెస్ తెలియజేయడానికి ముందుండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బేబీ టీం కోసం అప్రిషియేషన్ మీట్ ఏర్పాటు చేసాడు.

ఈ మీట్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనుంది. ఈ మీట్ కు బేబీ సినిమా పని చేసిన అఫ్ స్క్రీన్, మరియు ఆన్ స్క్రీన్ టెక్నీషియన్స్ అంత హాజరవనున్నారు. జులై 14 న రిలీజైన ఈ బేబీ సినిమా ఈరోజు వరకు బాక్స్ ఆఫీస్ వద్ద 43.8 కోట్లు సాధించి, యాభై కోట్ల సినిమా క్లబ్ లో చేరడానికి అతి చేరువలో ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా బేబీ మూవీ టీం ను అప్రిషియేషన్ చేయడం మంచి విషయమనే చెప్పాలి. ఈ సాయంత్రం 6 గంటలకు మొదలవనున్న ఈ కార్యక్రమాన్ని శ్రేయాస్ మీడియా నిర్వహించబోతుంది.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides Latest movie reviews & ratings, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు