Anand devarakonda : బ్లాక్ బస్టర్ బేబీ – 50 కోట్ల మార్క్ కు అతి చేరువలో

ప్రస్తుతం టాలీవుడ్ లో బేబీ ఫీవర్ నడుస్తుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన బేబి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తుంది. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే పాపులర్ రికార్డ్ అయిన 50 కోట్ల కలెక్షన్ మార్క్ ను రిలీజై, వారం రోజులు కూడా పూర్తి చేసుకోకుండానే టచ్ చేయబోతుంది ఈ బేబీ

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. గతంలో సంపూర్ణేష్ బాబు తో పలు స్పూఫ్ తీసిన సాయి రాజేష్ తనని తాను ఒక సీరియస్ ఫిలిం మేకర్ గా ప్రూఫ్ చేసుకోవాలని ఈ బేబీ సినిమాను రూపొందించాడు. అయితే ఆయన ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా ఫలించిందనే చెప్పాలి. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ప్రీమియర్ షోల నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది.

ఇక జులై 14 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మధ్య మొదటి మూడు రోజులు ఏ సినిమాకైన కలెక్షన్స్ రావడం ,మాములే అని, ఆ తరువాత ఈ సినిమాను ఎవరు పట్టించుకోరు అంటూ కొంతమంది ఈ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయగా, అందరి నోళ్లను మూయించేలా ఈ సినిమా వీకెండ్స్ లో కంటే వర్కింగ్ డేస్ లో కూడా మంచి థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సీ తో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ను సాధిస్తుంది.

- Advertisement -

ఇప్పటి వరకు ఈ సినిమా 43.8 కోట్ల వసూళ్లను రాబట్టి సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ రోజుతో సినిమా రిలీజై కేవలం 6 రోజులు మాత్రమే అవుతుండగా రానున్న రోజుల్లో 50 కోట్ల మార్క్ టచ్ చేయడం పెద్ద కష్టమైన పని కాదనే చెప్పాలి. మరి ఈ బేబీ పరుగు యాభై తో ఆగుతుందో, ఇంకా ఎక్కువే కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు