Vaishnavi Chaitanya: హిట్ అయితే అయింది.. కానీ, ఈ టార్చర్ ఏంటి ?

Vaishnavi Chaitanya

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కలిసి నటించిన మూవీ బేబి. నిబ్బా – నిబ్బి స్టోరీతో వచ్చిన ఈ బేబి మూవీని కాలేజ్ కుర్రాళ్లు బ్రహ్మరథం పట్టి మరీ హిట్ చేస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వస్తున్నాయి. అయినా, కాలేజ్ కుర్రాళ్ల పుణ్యామా అని బేబి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ లిస్ట్ లో చేరడానికి రెడీ అయిపోతుంది. అయితే ఈ సినిమా ఫర్మామెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ చెప్పుకునేది హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే.

బేబి సినిమాలో వైష్ణవి పాత్ర చేసిన వైష్ణవి చైతన్య నటనకు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. కానీ, అవే ఈ బ్యూటీకి శాపంగా మారాయి. సినిమాలో నటించి తప్పు చేసిందా అనే భావన వచ్చేలా కొంత మంది ఈ హీరోయిన్ ను టార్చర్ పెడుతున్నారు. సినిమాలో వైష్ణవి పాత్ర చేసిన తప్పుకు వైష్ణవి చైతన్యపైనే మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో డైరెక్ట్ గా వైష్ణవి చైతన్యనే ట్యాగ్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చేయడం తప్పు… అమ్మాయి అలా ఉండకూడదు అనే దాన్ని బేబి సినిమా ద్వారా దర్శకుడు సాయి రాజేశ్ చెప్పాలనుకున్నాడు. కానీ, అది బయటికి మాత్రం అలా రాలేదు. సినిమాను సూపర్ హిట్ చేస్తున్న కాలేజీ కుర్రాళ్లే… వైష్ణవి చైతన్యపై కోపం పెంచుకుంటున్నారు.

- Advertisement -

దీంతో తొలి సినిమా హిట్ అయిందని సంతోషపడాలా ? లేదా తొలి సినిమాకే ఇన్ని ట్రోల్స్, మరెన్నో విమర్శలు అందుకున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో వైష్ణవి చైతన్య ఉందని చెప్పొచ్చు.

ఏది ఏమైనా, వైష్ణవి చైతన్యకు తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ ట్రోల్స్, విమర్శలను పక్కన బెట్టి ఈ విజయాన్ని వైష్ణవి చైతన్య ఆస్వాదించాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides Latest movie reviews & ratings, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు