AAA Cinemas: మరో హీరోతో ఏషియన్ మల్టీప్లెక్స్..!

ఏషియన్ సినిమాస్ థియేటర్ రంగంలో కొత్త విప్లవం దిశగా అడుగులేస్తున్న సంస్థ. హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్ స్థాపించిన ఈ సంస్థ ఆ తర్వాత మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీ సినిమాస్ స్థాపించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి హైదరాబాద్ లో  AAA సినిమాస్ ను ఇటీవలే ప్రారంభించిన ఏషియన్ సినిమాస్ ప్రస్తుతం మరో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తో కలిసి చెన్నైలో మరో మల్టీప్లెక్స్ స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సునీల్ నారంగ్ ఓ మీడియా సమావేశంలో తెలిపాడు. వరుసగా హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ లు స్టార్ట్ చేయటం వెనక కారణం ఏంటని అడిగిన మీడియా ప్రశ్నకు సమాధానంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

మహేష్ బాబుతో కలిసి తన తండ్రి ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేసాడని, ముందుగా అనుకొని ఏది ప్లాన్ చేయలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ధాటికి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న థియేటర్ రంగానికి ఏషియన్ సంస్థ ఒకరకంగా కొత్త ఊపిరిని అందిస్తోందనే చెప్పాలి. అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ మల్టీప్లెక్స్ లు ప్రేక్షకుడికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని అందిస్తున్నాయని అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల లిస్ట్ లో శివకార్తికేయన్ కూడా చేరటంతో ఏషియన్ సంస్థ చెన్నైకి కూడా విస్తరించినట్లు అవుతుంది. మొత్తానికి ఏఎంబీ సినిమాస్ క్లిక్ అయినట్టుగానే ఆదిపురుష్ సినిమాతో ప్రారంభం కానున్న అల్లు అర్జున్ తో కలిసి ఏర్పాటు చేసిన AAA సినిమాస్ కూడా క్లిక్ అవుతుందా లేదా, హైదరాబాద్ లో లాగానే చెన్నైలో కూడా ఏషియన్ సంస్థ మల్టీప్లెక్స్ రంగంలో తన ప్రత్యేకత చాటుకుంటుందా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు