Tollywood: హీరోలకు డబ్బు మీద యావ పెరిగిందా..?

ఒకప్పుడు సినిమా హీరోలంటే ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ సినిమాలే వ్యాపకం, వ్యాపారంగా ఉండేవారు. కానీ, ప్రెజెంట్ జనరేషన్ హీరోలు అందుకు పూర్తి భిన్నంగా తయారయ్యారు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయటం కూడా గగనం అనే పరిస్థితి  ఏర్పడింది. ఇందుకు సినిమా క్వాలిటీ, మేకింగ్ స్టాండర్డ్స్ లో వచ్చిన మార్పులు కారణం అని చెప్పవచ్చు. ఇది పక్కన పెడితే, ఈ తరం హీరోలు కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ప్రొడక్షన్ హౌస్, హోటల్ ఇండస్ట్రీ వంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టి రాణిస్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సినిమాల్లోనే కాకుండా యాడ్స్ లో కూడా నటిస్తూ వాటికి భారీ ఎమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సంస్థతో కలిసి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ ప్రారంభించిసక్సెస్ కాగా, ఇటీవల అల్లు అర్జున్ కూడా ఏషియన్ సంస్థతో కలిసి AAA సినిమాస్ పేరిట మల్టీప్లక్స్ ప్రారంభించాడు.

అల్లు అర్జున్, మహేష్ బాబు మాత్రమే కాకుండా మహబూబ్ నగర్లో విజయ్ దేవరకొండ, నెల్లూరులో ప్రభాస్ లు కూడా థియేటర్లు స్థాపించి మల్టీప్లక్స్ రంగంలో అడుగు పెట్టారు. రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్స్, వీ మెగా పిక్చర్స్ పేరిట ప్రొడక్షన్ హౌస్ లు స్థాపించి ప్రొడ్యూసర్ గా మారాడు.దీన్ని బట్టి చూస్తే, నిన్నటితరం హీరోల లాగా కేవలం సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్ మీద ఆధారపడటం కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి తమ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని పెంచుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ స్టాండర్డ్స్ పాన్ ఇండియా స్థాయికి పెరగటంతో హీరోలు ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టి సినిమాలను నిర్లక్ష్యం చేస్తారా అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.

నిన్నటి తరం హీరోల్లో నాగార్జున, మోహన్ బాబు లాంటి ఒకరు ఇద్దరు పెద్దగా వ్యాపారాల మీద దృష్టి పెట్టలేదనే చెప్పాలి. కానీ, ప్రస్తుతం సందీప్ కిషన్ లాంటి చిన్న హీరో దగ్గర నుండి మహేష్ బాబు వంటి స్టార్ హీరో వరకు ప్రతి ఒక్కరు సినిమా ఆల్టర్నేటివ్ గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకున్న స్టార్ డం, ఇమేజ్ ని చూసుకొని భ్రమలో పడి బతకకుండా ఫ్యూచర్ ప్లానింగ్ తో వ్యాపారాల్లో అడుగుపెట్టడం మంచిదే అయినప్పటికీ వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి సినిమాలను నిర్లక్ష్యం చేస్తే ఇండస్ట్రీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు