Anushka: బొద్దుగా మారిన హీరోయిన్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో అనుష్క కూడా ఒకరు. సినిమా హీరోయిన్స్ లిస్టు తీస్తే జనాలను విపరీతంగా ఆకర్షించిన వారు చాలామంది ఉన్నారు. వారిలో సావిత్రి, జయసుధ, జయప్రద, విజయశాంతి, సౌందర్య వంటి వారు ప్రధానంగా ఉన్నారు. తర్వాత కాలంలో అనుష్క కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.

అయితే ప్రస్తుతం అనుష్క యు వి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండని ఈమె బయట కనిపించడం కూడా చాలా అరుదు. గత కొన్నేళ్ల క్రితం అనుష్క దర్శనమే అభిమానులకు కరువైంది. ఇదిలా ఉండగా, నిన్న మహాశివరాత్రి సందర్భంగా అనుష్క బెంగళూరులోని ఒక శివాలయంలో కనిపించింది. మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనడానికి అనుష్క తన కుటుంబంతో అక్కడికి వచ్చింది.

చాలాకాలం తర్వాత అనుష్కని చూస్తున్న అభిమానులకి ఆమె చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. చాలా బొద్దుగా మారిపోయింది. ట్రెడిషనల్ గా వైట్ చుడీదార్ లో అక్కడ భక్తిశ్రద్ధలతో అనుష్క కనిపించింది. దీంతో అనుష్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అనుష్క ఆందంలో మార్పు రాలేదు కానీ, ఆమె బరువు పెరిగింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకే బహుశా సినిమాలకు దూరం కాబోతోంది ఏమో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు